పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు.. తీవ్రంగా స్పందించిన సీపీఐ రామకృష్ణ

28-05-2026 Thu 11:26 | Andhra
Advertisement
  • సోదాలు నిర్వహించిన అధికారులు ఒట్టి చేతులతోనే వెనక్కి వెళ్లిపోయారన్న రామకృష్ణ
  • విజయన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే దాడులు చేశారని ఆరోపణ
  • బీజేపీ కండువా కప్పుకునే వారిపై దాడులు ఉండవని వ్యాఖ్య
Advertisement
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈడీ అధికారులు నిన్న సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ దాడులపై ఏపీ సీపీఐ నేత రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. దాడులను ఖండించిన ఆయన... సోదాలు నిర్వహించిన అధికారులు ఒట్టి చేతులతోనే వెనక్కి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. 

పదేళ్ల పాటు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న విజయన్ కు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉందని... ఆ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే ఈడీ దాడులు జరిగాయని రామకృష్ణ విమర్శించారు. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలపై ఈడీ దాడులు, అక్రమ కేసులు సాధారణమై పోయాయని దుయ్యబట్టారు. 

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా విషయంలో కూడా ఇదే జరిగిందని రామకృష్ణ అన్నారు. బీజేపీ కండువా కప్పుకునే వారు ఎవరైనా సరే వారిపై ఎలాంటి దాడులు జరగవని చెప్పారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బెంగాల్ సీఎం సువేందు అధికారిపై కూడా గతంలో మోదీ ఆరోపణలు చేశారని... అయితే, వారు బీజేపీలో చేరడంతో వాళ్లపై ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. కేవలం ప్రతిపక్ష నేతలపై మాత్రమే ఒక పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు.
Advertisement
Pinarayi VijayanKeralaED RaidsCPM RamakrishnaManish SisodiaBJPOpposition LeadersCorruption Allegations

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more