తెలుగు చిత్రపరిశ్రమ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది: దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్య

Dil Raju comments on Telugu film industry crisis
  • 'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరు
  • పరిశ్రమ చాలా బ్యాడ్ షేప్‌లో ఉందని చెప్పడానికి భయపడనని వ్యాఖ్య
  • ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం పెద్ద సవాల్ అన్న దిల్ రాజు
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. 'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశ్రమ చాలా బ్యాడ్ షేప్‌లో ఉందనే మాట చెప్పడానికి తాను భయపడనని వ్యాఖ్యానించారు. ఈ మాట చెప్పడానికి చాలామంది భయపడతారని అన్నారు. కానీ తాను ధైర్యంగా చెప్పగలనని అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం పెద్ద సవాల్ అన్నారు. 'సమ్మర్ హాలీడేస్' వంటి చిత్రాలను తీయడం ద్వారా ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకురావాలని వ్యాఖ్యానించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే మంచి సినిమాలు నిలబడతాయని అన్నారు. చిన్న సినిమాలతో డైరెక్టర్లు అందరూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.

కొత్త దర్శకులంతా మంచి చిత్రాలను తీసి పరిశ్రమను నిలబెట్టాలని అన్నారు. చిన్న సినిమాలు ఎంత విజయం సాధిస్తే పరిశ్రమ అంత బాగుంటుందని అన్నారు. ఈ చిత్రం ఈవెంట్ చాలా బాగా నిర్వహించారని, ఇందుకు నిర్మాతలను అభినందిస్తున్నానని అన్నారు. ఇటీవలి కాలంలో థియేటర్‌లలో సందడి కనిపించడం లేదని, ఈ చిత్రం ద్వారా థియేటర్‌లో సందడి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు.
Go Back to Shorts
Dil Raju
Telugu film industry
Tollywood
Summer Holidays movie
movie industry crisis
theatrical release

More Telugu News