బైజూస్ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు!

Byju Raveendran Faces 6 Months Jail Term in Singapore Court
  • ఆస్తుల వివరాల వెల్లడిలో ఉల్లంఘనలపై చర్యలు
  • ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ పిటిషన్‌తో విచారణ
  • జైలు శిక్షతో పాటు భారీ జరిమానా
  • అమెరికాలోనూ సాగుతున్న బిలియన్ డాలర్ల కేసు
  • అంతర్జాతీయంగా చట్టపరమైన ఇబ్బందుల్లో రవీంద్రన్‌
ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ ‘బైజూస్’ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో ఆయనకు సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఒకప్పుడు స్టార్టప్ ప్రపంచంలో బిలియనీర్‌గా వెలిగిన రవీంద్రన్, తన ఆస్తుల వివరాలను దాచడంతో న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఏ కేసులో ఈ శిక్ష?
బైజూస్ తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి చెందిన ఓ అనుబంధ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత జరిగిన ఒప్పంద ఉల్లంఘనల కారణంగా ఖతార్ సంస్థ సింగపూర్ కోర్టులో న్యాయపోరాటానికి దిగింది. తమ నిధులను రికవరీ చేసుకునే క్రమంలో భాగంగా ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది.

ఏం ధిక్కరించారు?
ఈ కేసు విచారణలో భాగంగా బైజూ రవీంద్రన్ తన వ్యక్తిగత ఆస్తులు, కంపెనీ వాటాల వివరాలను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ముఖ్యంగా ‘బీఆర్ ఇన్వెస్ట్‌కో’ అనే అనుబంధ సంస్థకు సంబంధించిన యాజమాన్య పత్రాలను చూపించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే గత కొంతకాలంగా కోర్టు ఇచ్చిన వరుస ఆదేశాలను ఆయన బేఖాతరు చేస్తూ వచ్చారు. ఆస్తుల వివరాలను వెల్లడించకుండా దాటవేయడంతో ఆగ్రహించిన సింగపూర్ కోర్టు ఆయన్ను లొంగిపోవాలని ఆదేశించింది.

చుట్టుముడుతున్న ఉచ్చు
జైలు శిక్షతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం సుమారు 70,500 డాలర్ల జరిమానా కూడా రవీంద్రన్ చెల్లించాల్సి ఉంది. బైజూస్ పతనం తర్వాత ఆయనపై కేవలం సింగపూర్‌లోనే కాకుండా అమెరికాలోనూ పెద్ద ఎత్తున కేసులు నడుస్తున్నాయి. అమెరికా రుణదాతల నుంచి తీసుకున్న 1.2 బిలియన్ డాలర్ల లోన్ రికవరీ కేసు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రవీంద్రన్ ప్రస్తుతం ఎక్కడున్నారనేది స్పష్టత లేదు.
Go Back to Shorts
Byju Raveendran
Byjus
Singapore court
Qatar Investment Authority
BR Investco
loan recovery
financial fraud
edtech company
court order violation
asset disclosure

More Telugu News