రాజాసింగ్‌కు సైబర్ కేటుగాడి ఫేక్ కాల్.. ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజాసింగ్!

26-05-2026 Tue 14:59 | Telangana
Advertisement
  • ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్ సెక్రటరీ దిలీప్ అని పరిచయం చేసుకున్న కేటుగాడు
  • డిప్యూటీ సీఎం పీఏకు ఫోన్ చేసి అలాంటి వ్యక్తి ఎవరూ లేరని నిర్ధారించుకున్న రాజాసింగ్
  • ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని రాజాసింగ్ హెచ్చరిక
Advertisement

సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు చాలామందిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను లక్ష్యంగా చేసుకుని కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని ఒక గుర్తు తెలియని వ్యక్తి మోసానికి తెరలేపగా, అప్రమత్తమైన రాజాసింగ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఫేక్ కాల్ ఉదంతంపై ఆయన స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి వివరాలు వెల్లడించారు.


రాజాసింగ్ తెలిపిన వివరాల ప్రకారం... నిన్న సాయంత్రం ఆయనకు ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్ సెక్రటరీ దిలీప్ కుమార్‌ని అంటూ పరిచయం చేసుకున్నాడు. "ప్రధాన మంత్రి వికసిత్ భారత్" పథకం కింద తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయని, దీని ద్వారా నియోజకవర్గ యువతకు 50 శాతం సబ్సిడీతో రూ.10 లక్షల రుణాలు ఇస్తామని నమ్మబలికాడు. అన్నింటిలో ముందుండే మీరు ఈ స్కీమ్‌కు ఎందుకు అప్లై చేయలేదని ప్రశ్నిస్తూ.. ఇవాళ రాత్రిలోపే ఆధార్ కార్డ్ వివరాలు పంపాలని ఒత్తిడి చేశాడు.


ఈ గడువు విధింపుతో అనుమానం వచ్చిన రాజాసింగ్... వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీఏకు ఫోన్ చేసి క్రాస్ చెక్ చేసుకున్నారు. ఆర్థిక శాఖలో దిలీప్ కుమార్ అనే అధికారి ఎవరూ లేరని, అసలు అలాంటి స్కీమే లేదని తేలడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు. నియోజకవర్గ ప్రగతి కోసమని ఆశపడి ప్రజాప్రతినిధులు ఇలాంటి మోసాల బారిన పడే ప్రమాదం ఉందని, రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని రాజాసింగ్ హెచ్చరించారు. ఈ సైబర్ నేరగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Advertisement
Raja SinghRaja Singh BJPcyber crimecyber fraudViksit BharatTelanganaBhatti Vikramarkacyber scamMLAcyber security

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more