ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం: పల్లా

Palla Srinivasa Rao says TDP Mahanadu will be held in hybrid mode and set Guinness Record
  • ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు
  • గిన్నిస్ రికార్డుపై టీడీపీ గురి
  • హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో నిర్వహణ
  • మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి మహానాడు
  • మొత్తం 20 తీర్మానాలపై 65 మంది ప్రసంగాలు
ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే మహానాడు గిన్నిస్ రికార్డు సృష్టించనుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో ఏకంగా 1,875 క్లస్టర్లలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మహిళామణులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ మహానాడు జరగనుందని పల్లా స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో భవిష్యత్ నాయకులను గుర్తించి, వారిని ప్రోత్సహించడానికే ఈ క్లస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే 1,875 క్లస్టర్లకు గానూ 1,851 క్లస్టర్లలో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు.

మహానాడు తొలిరోజు కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. తొలుత ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి, తెలుగుతల్లి గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొదటి సెషన్ గంటన్నర పాటు జరిగాక 15 నిమిషాల విరామం, మరో గంటన్నర రెండో సెషన్ తర్వాత భోజన విరామం ఉంటుందని చెప్పారు. ఈ మహానాడులో మొత్తం 20 తీర్మానాలపై 65 మంది వక్తలు ప్రసంగించనున్నట్లు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Go Back to Shorts
Palla Srinivasa Rao
TDP Mahanadu
Telugu Desam Party
Hybrid Mahanadu
Guinness Record
Andhra Pradesh Politics
NTR
Telugu Talli
Political Resolutions

More Telugu News