సినీ నటి రంభ కుటుంబంలో తీవ్ర విషాదం

Rambhas Family in Grief Father Venkateswara Rao Passes Away
  • రంభ తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూత
  • నువ్వు లేకుండా నేను లేను నాన్నా అంటూ రంభ భావోద్వేగం
  • మీరు లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరన్న రంభ

ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి రంభ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి వెంకటేశ్వరావు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. రంభ సినిమా రంగంలో స్టార్ హీరోయిన్‌గా ఎదగడంలో, ఆమె ప్రయాణంలో తండ్రి వెంకటేశ్వరావు అత్యంత కీలక పాత్ర పోషించి, అండగా నిలిచారు.


తండ్రి మృతిపై రంభ సోషల్ మీడియా ద్వారా తీవ్ర భావోద్వేగంతో స్పందిస్తూ.. “నువ్వు లేకుండా నేను లేను నాన్నా. నా జీవితంలో నువ్వు నింపిన శూన్యాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను” అంటూ తన బాధను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కష్టకాలంలో ఆమె కుటుంబానికి ధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.


తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికీ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు.


Go Back to Shorts
Rambha
Rambha actress
Rambha father
Venkateswara Rao
South Indian actress
Telugu cinema
actress Rambha
Rambha family
Rambha father death

More Telugu News