భారత్‌లో హోండా కొత్త కారు... లుక్ ఎలా ఉందో చూశారా?
భారత మార్కెట్లోకి హోండా హైబ్రిడ్ ఎస్‌యూవీ విడుదల
2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో లీటర్‌కు 22.79 కి.మీల మైలేజ్
జపాన్ నుంచి నేరుగా దిగుమతి చేసుకుని విక్రయం
హోండా సెన్సింగ్ ADAS టెక్నాలజీ, 8 ఎయిర్‌బ్యాగులతో పటిష్ఠ భద్రత
ప్రారంభమైన బుకింగ్స్.. జూలై నుంచి డెలివరీలు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీని మరింత పెంచుతూ హోండా కార్స్ ఇండియా తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ‘హోండా జడ్ఆర్-వీ హైబ్రిడ్’ను అధికారికంగా విడుదల చేసింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోడల్‌ను జపాన్ నుంచి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ) రూపంలో దిగుమతి చేసి విక్రయించనున్నారు. అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్‌తో ఇది వినియోగదారులను ఆకట్టుకోనుంది.
డిజైన్.. కొలతలు
చూడగానే ఆకట్టుకునే స్టైలిష్ డిజైన్‌తో ఈ కారు రూపుదిద్దుకుంది. దీని స్లిక్ ఎస్‌యూవీ సిల్హౌట్, ఫ్లోయింగ్ బాడీ లైన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముందు భాగంలో గ్లాసీ బ్లాక్ వర్టికల్ స్లాట్ గ్రిల్, స్లిమ్ ఫుల్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ ఫినిషర్, 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ స్పోర్టీనెస్ జోడిస్తాయి. ఈ ఎస్‌యూవీ 4,567 ఎంఎం పొడవు, 1,840 ఎంఎం వెడల్పు, 1,621 ఎంఎం ఎత్తు, 2,655 ఎంఎం వీల్‌బేస్‌తో విశాలంగా ఉంది.
ఇంటీరియర్.. ఫీచర్లు
కేవలం బయటికే కాదు, కారు లోపల కూడా హోండా ప్రీమియం అనుభూతిని అందించింది. స్పోర్టీ ఆల్-బ్లాక్ థీమ్‌తో కూడిన ఇంటీరియర్‌లో సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ వాడారు. డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే), 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. పానరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 12-స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు ప్రయాణ అనుభూతిని మెరుగుపరుస్తాయి. వెనుక సీట్లను మడిస్తే 1,313 లీటర్ల భారీ లగేజ్ స్పేస్ అందుబాటులో ఉంటుంది.
ఇంజిన్.. భద్రత
ఈ ఎస్‌యూవీకి గుండె వంటిది దీని 2.0-లీటర్ ఇ:హెచ్ఇవీ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్. 2.0లీటర్ల అట్కిన్‌సన్-సైకిల్ పెట్రోల్ ఇంజిన్, డ్యూయల్ మోటార్ హైబ్రిడ్ సిస్టమ్ కలిసి 184 బీ హెచ్ పీ పవర్, 315 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది లీటరుకు 22.79 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని హోండా పేర్కొంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్, ఇంజిన్ మోడ్‌ల మధ్య ఇది ఆటోమేటిక్‌గా మారుతుంది.
భద్రత విషయంలో హోండా అత్యున్నత ప్రమాణాలు పాటించింది. ఇందులో భాగంగా హోండా సెన్సింగ్ (ADAS) సూట్‌ను అందించింది. కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లతో పాటు 8 ఎయిర్‌బ్యాగులు, 360° కెమెరా, హిల్ డీసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.
బుకింగ్స్.. వారంటీ
హోండా జడ్ఆర్-వీ హైబ్రిడ్ కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జూలై నుంచి డెలివరీలు మొదలవుతాయి. ఈ కారుపై 3 సంవత్సరాల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ, బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1,60,000 కి.మీ వారంటీని కంపెనీ అందిస్తోంది. ప్లాటినం వైట్ పెరల్, క్రిస్టల్ బ్లాక్ పెరల్ సహా పలు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభ్యం కానుంది.