పుణ్యక్షేత్రం నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.. దంపతుల మృతి

Adari Kurmarao couple died in Anakapalli road accident
  • అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘటన 
  • ఆగి ఉన్న లారీని ఢీకొన్న మహీంద్ర వాహనం
  • ఘటనాస్థలంలోనే ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు
  • భద్రాచలం నుంచి తిరిగి వస్తుండగా జరిగిన దుర్ఘటన
అనకాపల్లి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ మహీంద్ర వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగపాక మండలానికి చెందిన ఒకే కుటుంబం భద్రాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లింది. దైవ దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాళ్లపాలెం సమీపంలోకి రాగానే మహీంద్ర వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో వాహనం ముందుభాగం నుజ్జునుజ్జయింది.

సమాచారం అందుకున్న కసింకోట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను ఆడారి కూర్మారావు (42), జ్యోతి (31)గా గుర్తించారు. గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Advertisement
Adari Kurmarao
Anakapalli accident
Road accident
Kasimkota
Andhra Pradesh
Bhadrachalam
Couple death
Lorry collision
National Highway
Munagapaka

More Telugu News