హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ టోల్ వసూలు.. స్పందించిన అమెరికా

Marco Rubio opposes Iran toll collection at Hormuz Strait
  • వసూళ్లు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్న మార్కో రుబియో
  • అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాల్లో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి లేదన్న అమెరికా
  • టోల్ వసూలు చేయాలని నిర్ణయిస్తే శాంతి చర్చలను సంక్లిష్టం చేసినట్లే అన్న అమెరికా
హర్మూజ్ జలసంధి వద్ద టోల్ వసూలు చర్యలను ఏ దేశం కూడా అంగీకరించకూడదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. హర్మూజ్ మీదుగా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయాలని ఇరాన్ యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అమెరికా స్పందించింది. ఇలాంటి వసూళ్లు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాల్లో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి లేదని స్పష్టం చేశారు.

హర్మూజ్ వద్ద స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఎవరూ భంగం కలిగించలేరని అన్నారు. ఇరాన్ టోల్ వసూలు చేయాలని నిర్ణయిస్తే రెండు దేశాల మధ్య శాంతి చర్చలను మరింత సంక్లిష్టం చేసినట్లే అని పేర్కొన్నారు.

హర్మూజ్ జలసంధిని దాటే నౌకల నుంచి పెద్ద మొత్తంలో టోల్ వసూలు చేయడం ప్రారంభమైందని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. ఈ క్రమంలో నౌకల యజమానులు, అందులో ఉన్న సరకు, అవి చేరుకోవాల్సిన గమ్యస్థానాల గురించి పూర్తి సమాచారాన్ని ఇరాన్ అధికారులకు ముందే తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. హర్మూజ్‌పై నియంత్రణ కోసం, అమెరికాతో యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని ఈ టోల్ ద్వారా కొంత పూడ్చుకోనున్నట్లు తెలిపింది. అయితే ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
Go Back to Shorts
Marco Rubio
Hormuz Strait
Iran
United States
Toll collection
International law
Maritime traffic
Shipping
Persian Gulf

More Telugu News