హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లకు అధిక డిమాండ్.. నిల్వ కోసం ముందస్తు బుకింగ్!

Telangana
Advertisement
  • అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలు
  • గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి భారీగా పెరిగిన ట్యాంకర్ బుకింగ్‌లు
  • ఈ సంవత్సరం మే 20వ తేదీ నాటికి 2.60 లక్షల ట్యాంకర్ల నీటి సరఫరా
Advertisement
హైదరాబాద్ నగరంలో ప్రజలు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతకు తోడు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. భానుడి భగభగ కారణంగా నగరంలో తాగునీటి వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో జలమండలి నీళ్ల ట్యాంకులకు కూడా డిమాండ్ భారీగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులను ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారు.

నగరంలో మే నెల మొదటి 20 రోజుల్లో సుమారు 2.60 లక్షల ట్యాంకర్ల నీటిని సరఫరా చేసినట్లు జలమండలి తెలిపింది. ప్రస్తుతం వారం రోజులుగా రోజుకు సగటున 12 వేలకు పైగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎక్కువ ట్యాంకర్లకు డిమాండ్ ఉండేది. మే నెలలో కాస్త తగ్గేది. కానీ ఈసారి ఇందుకు భిన్నంగా మే నెలలో ఎక్కువ ట్యాంకుల కోసం బుక్ చేసుకున్నారు.

గత సంవత్సరం మే నెలలో మొదటి 20 రోజుల్లో 1.69 లక్షల నీటి ట్యాంకర్లకు డిమాండ్ ఉండగా, ఈసారి 2.60 లక్షల ట్యాంకర్లతో నీటి సరఫరా జరిగింది. వర్షాలు పడి, వాతావరణం కాస్త చల్లబడేవరకు నీటి ట్యాంకర్ల బుకింగ్ ఇదేవిధంగా ఉండవచ్చని భావిస్తున్నారు. గత మూడేళ్లను పరిశీలిస్తే 2024 మే 20వ తేదీ నాటికి 1,18,191 ట్యాంకర్లు, 2025 అదే కాలంలో 1,69,347 ట్యాంకర్లు నీటిని సరఫరా జరింది. 

పెట్రోల్, డీజిల్ కొరత ఆందోళనలు తలెత్తినప్పుడు వాహనదారులు బంకుల వద్ద క్యూకట్టి ముందస్తుగా భద్రపరుచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ కొరత భయాలతోనూ ప్రజలు గ్యాస్ కోసం వేగంగా బుకింగ్ చేసి, ఇంట్లో భద్రపరుచుకున్నారు. అదనపు గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేయడంతో అవసరమైన వారికి దొరకకుండా పోయింది. ఇప్పుడు ఇదే కోవలో హైదరాబాద్‌లో నీటిని కూడా ముందస్తుగా బుకింగ్ చేసి భద్రపరుచుకుంటున్నారు. కొంతమంది అవసరం లేకపోయినా ట్యాంకర్లను బుక్ చేసుకుని నీటిని నిల్వ చేసుకుంటున్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది నీటి కొరత, ట్యాంకర్ల బుకింగ్‌లో అత్యధికస్థాయికి చేరుకున్నాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Hyderabad Water SupplyHyderabadWater TankersWater DemandSummerHeat WaveTelangana

More Telugu News

యూత్ ఒలింపిక్స్‌లో ధినిధికి కాంస్యం.. స్విమ్మింగ్‌లో నవశకం!

03 Nov, 08:47

రాప్తాడు ఉన్మాది హేమంత్‌కు జీవిత ఖైదు పడే ఛాన్స్.. కఠిన సెక్షన్లతో కేసులు నమోదు

03 Nov, 08:47

ఉద్యోగాల పేరుతో మోసం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న విశాఖ యువకులు!

03 Nov, 08:46

వైసీపీకి ఎదురుదెబ్బ.. పులివెందుల మున్సిపల్‌ ఓట్ల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

03 Nov, 08:37

భారత్‌తో వాణిజ్య ఒప్పందం మా ఘనతే.. 127 హామీల జాబితా విడుదల చేసిన వైట్‌హౌస్

03 Nov, 08:36

అమెరికాను టెన్షన్ పెడుతున్న చైనా 'దైవ నాగ'.. బయటకొచ్చిన హై-రిజల్యూషన్ చిత్రం

03 Nov, 08:36

ఢిల్లీలో లాలూతో సోనియా భేటీ.. ఆరోగ్యంపై ఆరా

03 Nov, 08:15

అచ్చం సినిమాలో జరిగినట్టే.. మత గురువును ఇరికించేందుకు పోలీసుల కుట్ర.. వీడియో ఇదిగో !

03 Nov, 08:13

మూడు వరల్డ్ కప్‌ల హీరో.. అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ వీడ్కోలు

03 Nov, 08:13

ఆడబిడ్డ ప్రాణంతో జగన్ రాజకీయం: ఎమ్మెల్యే గల్లా మాధవి

03 Nov, 07:46

తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజామున 3:30కు సీఎం చంద్రబాబు సమీక్ష

03 Nov, 07:43

ఉద్యమం చేసి బతుకు ఆగం చేసుకున్నా.. సూసైడ్ నోట్ రాసి తెలంగాణ ఉద్యమకారుడి బలవన్మరణం

03 Nov, 07:22

ఆ గెలుపు ఎప్పటికీ ప్రత్యేకం.. వరల్డ్ కప్ విజయాన్ని గుర్తుచేసుకున్న క్రీడాకారిణులు

03 Nov, 07:14

గేమింగ్ రంగంలోకి సూపర్ స్టార్.. షాట్‌గన్ గేమ్స్‌లో మహేశ్ బాబు పెట్టుబడి

03 Nov, 06:59

ఏపీ పురపోరు: 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం.. సాయంత్రానికి ఫలితాలు

03 Nov, 06:40
..More Telugu News