వచ్చే నెలలో చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటన
- మూడు రోజుల పాటు సింగపూర్ లో చంద్రబాబు, లోకేష్ పర్యటన
- జూన్ 14 నుంచి 16 వరకు పర్యటన
- వరల్డ్ సిటీస్ సమ్మిట్‌కు హాజరు
- ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే పర్యటన లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలో సింగపూర్‌లో పర్యటించనున్నారు. సింగపూర్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు జూన్ 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పర్యటన జరగనుంది.
సింగపూర్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ సిటీస్ సమ్మిట్'లో చంద్రబాబు, లోకేష్ పాల్గొంటారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలతో వారు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వారికి వివరించనున్నారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి, మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొందరు సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్‌ను ఒక కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.