రేపు సొంత జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే!
- శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
- కండ్రిగలో 'సంజీవని' ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
- సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, రోగులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి
- పర్యటనలో భాగంగా పార్టీ కేడర్‌తోనూ ప్రత్యేక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (మే 23) సొంత జిల్లా చిత్తూరులో పర్యటించనున్నారు. ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తలపెట్టిన 'సంజీవని' కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
వివరాల్లోకి వెళితే, శనివారం ఉదయం 9 గంటలకు అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి, ఉదయం 11 గంటలకల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ప్రజా వేదికలో పాల్గొని, 'సంజీవని' కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.
ఈ కార్యక్రమం అనంతరం, మధ్యాహ్నం 1:35 గంటలకు సీఎం సంతగేటులోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 2:20 గంటలకు సంతగేటు సమీపంలోనే టీడీపీ కార్యకర్తలతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కేడర్‌కు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం, సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి అమరావతికి పయనమవుతారని అధికారులు తెలిపారు.