Advertisement

బండి భగీరథ్ పోక్సో కేసు.. కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

POCSO Court Adjourns Bandi Bhagirath Custody Petition Hearing
  • మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు
  • విచారణ కోసం భగీరథ్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్
  • విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన కోర్టు

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్ కస్టడీ పిటిషన్‌పై మల్కాజ్‌గిరి పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణ వాయిదా పడింది. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు సేకరించేందుకు భగీరథ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.


ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించడంతో పాటు, ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్లు భగీరథ్‌పై ఫిర్యాదు అందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈనెల 26న కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తుందా లేదా అనేది తేలనుంది.

Advertisement
Bandi Bhagirath
POCSO Act
Minor Girl
Sexual Harassment Case
Malkajgiri Court
Cyber Crime
Social Media Threat
Telangana Crime

More Telugu News