భారత మార్కెట్లోకి 2026 హోండా సిటీ.. హ్యుండాయ్ వెర్నాకు గట్టి పోటీ!

Business
Advertisement
  • భారత మార్కెట్లోకి కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ విడుదల
  • ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయం
  • సరికొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్
  • పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ వేరియంట్‌లోనూ లభ్యం
  • హ్యుండాయ్ వెర్నా, స్కోడా స్లావియాలతో పోటీ
Advertisement
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా, తన పాపులర్ సెడాన్ 'సిటీ'కి కొత్త సొబగులు అద్దింది. 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇస్తున్న హ్యుండాయ్ వెర్నా, స్కోడా స్లావియా, వోక్స్‌వాగన్ వర్చ్యూస్ వంటి కార్లకు దీటుగా నిలవడమే లక్ష్యంగా హోండా ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డిజైన్ పరంగా పలు కీలక మార్పులు చేశారు. కొత్త ఫ్రంట్ ఫేసియా, ఆకర్షణీయమైన హనీకాంబ్ ప్యాటర్న్ గ్రిల్, కనెక్టెడ్ లైట్ స్ట్రిప్‌తో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్స్ దీనికి సరికొత్త లుక్‌ను అందిస్తున్నాయి. బంపర్ డిజైన్‌ను కూడా మార్చారు. వెనుక వైపు స్మోక్డ్ టైల్‌లైట్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్‌తో కూడిన బూట్ లిడ్ వంటివి ఆకట్టుకుంటున్నాయి.

కారు లోపల కూడా ఆధునిక ఫీచర్లను జోడించారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. భద్రతకు పెద్దపీట వేస్తూ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్)ను కూడా అందిస్తున్నారు.

ఇంజిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 121 హెచ్ పీ శక్తిని, 145 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇక, ఈ-హెచ్ఈవీ హైబ్రిడ్ వేరియంట్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిసి 126 హెచ్ పీ శక్తిని, 253 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఈ హైబ్రిడ్ వేరియంట్ లీటరుకు 27.26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 
Advertisement

సంబంధిత వార్తలు

Honda CityHonda City 2026Hyundai VernaSedan carsCar launch IndiaAutomotive industryHybrid carsADASCar prices IndiaNew car models

More Telugu News

ఖేష్మ ద్వీపంలో భారీ పేలుళ్లు.. హర్మూజ్‌ సమీపంలో ఏం జరుగుతోంది?

03 Nov, 09:39

సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్.. తుపాన్ల నష్టంపై ఆరా

03 Nov, 09:35

భార్యకు 20 ఏళ్లుగా నరకం.. భర్త ఫోన్‌లో 10 లక్షలకు పైగా అకృత్యాల ఫొటోలు, వీడియోలు!

03 Nov, 09:29

డిస్నీలోనూ లేఆఫ్స్‌.. వేలాది ఉద్యోగాల కోతకు సిద్ధమైన వినోద రంగ దిగ్గజం

03 Nov, 09:18

డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్‌ వీటో’గా మారిపోతా.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

03 Nov, 09:11

యూత్ ఒలింపిక్స్‌లో ధినిధికి కాంస్యం.. స్విమ్మింగ్‌లో నవశకం!

03 Nov, 08:47

రాప్తాడు ఉన్మాది హేమంత్‌కు జీవిత ఖైదు పడే ఛాన్స్.. కఠిన సెక్షన్లతో కేసులు నమోదు

03 Nov, 08:47

ఉద్యోగాల పేరుతో మోసం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న విశాఖ యువకులు!

03 Nov, 08:46

వైసీపీకి ఎదురుదెబ్బ.. పులివెందుల మున్సిపల్‌ ఓట్ల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

03 Nov, 08:37

భారత్‌తో వాణిజ్య ఒప్పందం మా ఘనతే.. 127 హామీల జాబితా విడుదల చేసిన వైట్‌హౌస్

03 Nov, 08:36

అమెరికాను టెన్షన్ పెడుతున్న చైనా 'దైవ నాగ'.. బయటకొచ్చిన హై-రిజల్యూషన్ చిత్రం

03 Nov, 08:36

ఢిల్లీలో లాలూతో సోనియా భేటీ.. ఆరోగ్యంపై ఆరా

03 Nov, 08:15

అచ్చం సినిమాలో జరిగినట్టే.. మత గురువును ఇరికించేందుకు పోలీసుల కుట్ర.. వీడియో ఇదిగో !

03 Nov, 08:13

మూడు వరల్డ్ కప్‌ల హీరో.. అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ వీడ్కోలు

03 Nov, 08:13

ఆడబిడ్డ ప్రాణంతో జగన్ రాజకీయం: ఎమ్మెల్యే గల్లా మాధవి

03 Nov, 07:46
..More Telugu News