19 ఏళ్ల యువతికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు.. వీడియో వైరల్

  • షిరిల్లా అనే యువతికి పదిహేనేళ్ళ జైలు శిక్ష
  • ఉద్దేశపూర్వకంగా కారును వేగంగా నడిపి ప్రియుడు, అతడి స్నేహితుడి హత్య
  • వాహనాన్ని గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పోనిచ్చిన యువతి
19 ఏళ్ల యువతికి అమెరికా కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. షిరిల్లా అనే యువతి కారును ఉద్దేశపూర్వకంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నడిపి తన ప్రియుడిని, అతడి స్నేహితుడిని హత్య చేసింది. వీరిద్దరిని చంపిన కేసులో ఆమెకు కోర్టు జైలు శిక్ష విధించింది.

2022లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆమె వయస్సు 17. ఈ కేసులో ఆమె నేరం చేయలేదని నిరూపించే సాక్ష్యాలు ఏమీ చూపించలేకపోయారని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ఈ ప్రమాదంలో షిరిల్లా ప్రియుడు డొమినిక్ రుస్సో, అతని స్నేహితుడు 19 సంవత్సరాల డేవియన్ ఫ్లానగన్ సంఘటన స్థలంలో మరణించారు. వారిద్దరితో కలిసి డ్రైవ్‌కు వెళ్లిన షిరిల్లా, ఉద్దేశపూర్వకంగా ఇటుక గోడను ఢీకొట్టిందని దర్యాప్తు అధికారులు తేల్చారు. వాహనాన్ని గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నడిపింది.

Shirlilla
America court
Dominic Russo
Davion Flanagan
Car accident
Murder case
Jail sentence

More Telugu News