రాజస్థాన్‌లో 21 ట్రాక్టర్లతో పెళ్లి ఊరేగింపు.. స్వయంగా ట్రాక్టర్ నడిపిన వరుడు

Jitendra Drives Tractor in Rajasthan Wedding Procession
  • మహాలాలోని ధాని ప్రాంతంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఊరేగింపు
  • తమది వ్యవసాయ ఆధారిత కుటుంబమన్న వరుడు
  • చిన్ననాటి నుంచి ట్రాక్టర్ తన జీవితంలో భాగంగా ఉందన్న వరుడు
రాజస్థాన్‌లోని గూఢగౌడ్జీ ప్రాంతంలో 21 ట్రాక్టర్లతో జరిగిన వివాహ ఊరేగింపు అందరి దృష్టిని ఆకర్షించింది. మహాలాలోని ధాని ప్రాంతానికి చెందిన వరుడు జితేంద్ర 21 ట్రాక్టర్లతో ఊరేగింపులో పాల్గొన్నాడు. అందులో ఒక ట్రాక్టరును వరుడు స్వయంగా నడిపాడు. దీనిపై జితేంద్ర మాట్లాడుతూ, తమది వ్యవసాయ ఆధారిత కుటుంబమని తెలిపారు. గతంలో తమ తాతముత్తాతల వివాహ ఊరేగింపునకు ట్రాక్టర్లనే వినియోగించినట్లు చెప్పారు.

ఈ విషయాన్ని తన తన తండ్రి, ఇతర పెద్దలు చెప్పారని అన్నారు. అందుకే తాను కూడా కార్లతో కాకుండా ట్రాక్టర్లతో ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. చిన్ననాటి నుంచి తన జీవితంలో భాగమైన ట్రాక్టర్‌ను తన జీవిత భాగస్వామిని తమ ఇంటికి తీసుకువెళ్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. చాలా ఏళ్ళ తర్వాత విభిన్నమైన, స్ఫూర్తిదాయకమైన వివాహ ఊరేగింపును చూశామని స్థానికులు అంటున్నారు.
Go Back to Shorts
Jitendra
Rajasthan wedding
tractor procession
Indian weddings
Gudha Gorji
Mahala Dhani
unique wedding

More Telugu News