ఆసుపత్రి వద్ద కెమెరాలు చూసి చిర్రెత్తిపోయిన సల్మాన్ ఖాన్

Salman Khan Angry at Paparazzi Outside Mumbai Hospital
  • ముంబై ఆసుపత్రి వద్ద పాపరాజీపై సల్మాన్ ఆగ్రహం 
  • ‘పాగల్ హో క్యా?’ అంటూ ఫొటోగ్రాఫర్లపై ఫైర్  
  • సల్మాన్ హెచ్చరికతో క్షమాపణలు చెప్పి వీడియో ఆపేసిన పాపరాజీ
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ పాపరాజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముంబైలోని ఓ ఆసుపత్రి వద్ద తనను చుట్టుముట్టిన ఫొటోగ్రాఫర్ల తీరుపై మండిపడ్డాడు. ‘మీకు పిచ్చెక్కిందా?’ (పాగల్ హో క్యా?) అంటూ సీరియస్ అయ్యాడు. ఈ ఘటన మంగళవారం ముంబైలోని మహిమ్ ప్రాంతంలో ఉన్న హిందూజా ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంది.

ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న సల్మాన్‌ను ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. ఆయన తన కారు వైపు వెళ్తుండగా ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పద్ధతిగా ప్రవర్తించాలని హెచ్చరించాడు. సల్మాన్ తీవ్ర స్వరంతో మాట్లాడటంతో ఫొటోగ్రాఫర్లు వెంటనే క్షమాపణలు చెప్పి వీడియో తీయడం ఆపేశారు. అయితే, సల్మాన్ ఖాన్ ఎవరిని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారనే విషయంపై స్పష్టత రాలేదు.

కాగా, తాను ఒంటరిగా ఉన్నానంటూ వస్తున్న వార్తలపై సల్మాన్ ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. తనకు పెద్ద కుటుంబం, స్నేహితులు ఉన్నారని, తాను ఒంటరిని కాదని స్పష్టం చేశాడు. కొన్నిసార్లు ఎక్కువ మందితో ఉండి తన సోషల్ బ్యాటరీ అయిపోతుందని, అందుకే కొంత ‘మీ టైమ్’ తీసుకుంటానని తన ఎక్స్ ఖాతాలో వివరించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పాపరాజీపై అసహనం వ్యక్తం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. 
Go Back to Shorts
Salman Khan
Bollywood
Mumbai
Hinduja Hospital
Paparazzi
Celebrity
Actor
Social Battery
Mahim
Photographers

More Telugu News