విజయ్ సర్కార్‌కు సీపీఎం హెచ్చరిక.. అప్పుడే మొదలైన విభేదాలు!
- అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చేర్చుకుంటే మద్దతుపై పునరాలోచిస్తామన్న సీపీఎం
- ప్రజాతీర్పునకు, క్లీన్ గవర్నెన్స్ హామీకి ఇది విరుద్ధమన్న మిత్రపక్షం
- విశ్వాస పరీక్షలో విజయ్‌కు 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు
- కొత్తగా ఎన్నికలు రాకూడదనే విజయ్‌కు మద్దతిస్తున్నామని తెలిపిన సీపీఎం
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది రోజులు కూడా కాకముందే, దాని స్థిరత్వంపై ఆందోళనలు మొదలయ్యాయి. అధికార కూటమిలోని కీలక మిత్రపక్షమైన సీపీఎం చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలాన్నిచ్చాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కూటమిలో చేర్చుకుంటే తమ మద్దతుపై పునరాలోచించాల్సి వస్తుందని సీపీఎం స్పష్టంగా హెచ్చరించింది.
బుధవారం మీడియాతో మాట్లాడిన సీపీఎం నేతలు, అన్నాడీఎంకే వర్గాన్ని ప్రభుత్వంలో భాగం చేయడం ప్రజాతీర్పునకు విరుద్ధమని అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు డీఎంకే, అన్నాడీఎంకే రెండు పార్టీలనూ తిరస్కరించారని గుర్తుచేశారు. అన్నాడీఎంకేను చేర్చుకోవడం విజయ్ ఇచ్చిన 'క్లీన్ గవర్నెన్స్' హామీకి కూడా వ్యతిరేకమని తెలిపారు. "తమిళనాడు మరో ఎన్నికను ఎదుర్కోకూడదని, గవర్నర్ పాలన ద్వారా బీజేపీ వెనుక దారిలో అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే మేము టీవీకేకు మద్దతిస్తున్నాం" అని సీపీఎం వివరించింది.
ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడగా విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) 234 స్థానాలకు గానూ 108 స్థానాలు గెలుచుకుంది. మెజారిటీకి 10 సీట్లు తక్కువయ్యాయి. ఆ తర్వాత కాంగ్రెస్ (5), లెఫ్ట్ ఫ్రంట్, వీసీకే, ఐయూఎంఎల్ (8) పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పడింది.
అయితే, మే 13న జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్‌కు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ఇందులో పార్టీ అధినేత పళనిస్వామి విప్‌ను ధిక్కరించి 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌కు ఓటు వేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని అన్నాడీఎంకే చర్యలు చేపట్టింది. విశ్వాస పరీక్షకు ముందు విజయ్ ఈ రెబల్ ఎమ్మెల్యేలతో సమావేశం కావడం గమనార్హం. ఇప్పుడు వారి మద్దతే అధికార కూటమిలో సీపీఎం రూపంలో కొత్త తలనొప్పికి కారణమైంది.