నా తమ్ముడిని నేనే ఏడిపిస్తా.. వేరే వాళ్లకి ఆ ఛాన్స్ లేదు: కయాదు లోహర్
- తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నటి కయాదు లోహర్ పోస్ట్
- జీవితంలో ఎక్కడికెళ్లినా నీ వెంటే ఉంటానని భావోద్వేగ కామెంట్స్
- జీవీ ప్రకాష్ హీరోగా 'ఇమ్మోర్టల్' అనే హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్న కయాదు
- ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటన
- ఆసక్తికరంగా సినిమా టీజర్
తన తమ్ముడిపై ఉన్న ప్రేమను చాటుకుంటూ నటి కయాదు లోహర్ పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "హ్యాపీ బర్త్‌డే నా బేబీ బ్రదర్. నువ్వు ఎంత పెరిగినా నాకు ఎప్పటికీ చిన్న పిల్లాడివే. జీవితంలో ఏది కాకముందే నేను మొదటగా ఒక అక్కనయ్యాను" అని కయాదు తన పోస్టులో పేర్కొంది.
"నీకు అక్కగా ఉండటం ఒక ఫుల్‌టైమ్ జాబ్ లాంటిది. నువ్వు వినకపోయినా నీకు సలహాలు ఇవ్వడం, అందరి నుంచి నిన్ను కాపాడటం, చివరకు నేనే కరెక్ట్ అని గుర్తుచేయడం నా పని. నేను నిన్ను ఏడిపించినా, నీతో గొడవపడినా అది అక్కగా నాకున్న ప్రత్యేక హక్కు. నా తమ్ముడిని నేను తప్ప ఇంకెవరూ ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు" అని సరదాగా రాసుకొచ్చారు. చివరగా, "జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్లినా నీ వెనకాలే ఉండి నిన్ను కాపాడుతూ, నీకు అండగా నిలుస్తూ, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను" అని తన ప్రేమను చాటుకున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే, కయాదు లోహర్ ప్రస్తుతం జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తున్న 'ఇమ్మోర్టల్' అనే హారర్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. మారియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. రొమాంటిక్, కామెడీతో మొదలై, చివర్లో గబ్బిలం ముఖంతో ఉన్న ఓ భయంకరమైన రూపంతో హారర్ జోనర్‌లోకి వెళ్లడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో టీఎం కార్తీక్, ఆదిత్య కతిర్, సునీత శ్రేష్ఠ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.