‘ఉగ్రవాద నిరోధక చట్టం’ కేసులోనూ బెయిల్‌ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

18-05-2026 Mon 13:50 | National
Advertisement
  • యూఏపీఏ కేసుల్లోనూ బెయిలే రూల్
  • ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ నిరాకరణపై అభ్యంతరం
  • పెద్ద బెంచ్ తీర్పులను చిన్న బెంచ్ పాటించలేదు
  • విచారణకు ముందే శిక్ష పడొద్దు
  • ఆరేళ్లుగా జైల్లో ఉన్న ఇఫ్తికార్‌కు బెయిల్
Advertisement
ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ అనేది ఒక రూల్’ అని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. దిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌కు గతంలో బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన సొంత ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖాలిద్‌కు బెయిల్ నిరాకరించిన గత ధర్మాసనం.. సుదీర్ఘకాలం జైల్లో ఉండటానికి సంబంధించిన పాత తీర్పులను, నిబంధనలను సరిగ్గా పాటించలేదని స్పష్టం చేసింది.

జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పులకు చిన్న బెంచ్‌లు కట్టుబడి ఉండాలని, వాటిని మార్చడం లేదా విస్మరించడం చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. గత జనవరిలో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం అనుసరించిన విధానాన్ని అంగీకరింలేమని పేర్కొంది. విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతున్నప్పుడు.. కఠినమైన యూఏపీఏ చట్టం కింద కూడా నిందితుడికి బెయిల్ పొందే హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది.

ప్రాథమిక విచారణలోనే కేసు నిజమని తేలితే.. విచారణ ఎన్ని ఏళ్లు సాగినా బెయిల్ ఇవ్వకూడదనే వాదనను సుప్రీంకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. ఇలాంటి పద్ధతిని అంగీకరిస్తే.. విచారణ పూర్తి కాకుండానే నిందితుడికి జైలు శిక్ష విధించినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని పేర్కొంది. ఆరు సంవత్సరాలుగా కస్టడీలో ఉన్న సయ్యద్ ఇఫ్తికార్ అనే నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఈ తాజా ఆదేశాలు ఇచ్చింది.
Advertisement
Umar KhalidUAPA actSupreme courtBail ruleDelhi riots caseSharjeel ImamAnti terrorism lawSayyed Iftikhar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more