బండి భగీరథ్ అరెస్ట్.. కేంద్రానికి సంబంధం లేదు: కిషన్ రెడ్డి
- పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్
- ఇప్పటికే సరెండర్ అయ్యాడన్న కిషన్ రెడ్డి
- ఇక చర్చించాల్సిన అవసరం లేదని వెల్లడి
- రాష్ట్ర పోలీసులే చూసుకుంటారని స్పష్టీకరణ
ప్రతిపైసా కేంద్రానిదే
మరోవైపు ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రతిపైసా కేంద్రమే ఇస్తోందని వెల్లడించారు. అయినా రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా సన్న వడ్లకు రాష్ట్రం బోనస్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని.. వారికి రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. మంత్రులు స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో కొనుగోళ్లను పర్యవేక్షించాలని సూచించారు.