తమిళ దర్శకుడు వేధించాడు.. నాపై కేసు పెట్టారు: లావణ్య త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు

  • తమిళ దర్శకుడి వేధింపుల వల్ల సినిమా వదులుకున్నానని వెల్లడి
  • బ్లాక్‌బస్టర్ ‘గీత గోవిందం’ అవకాశం మొదట తనకే వచ్చిందని వెల్లడి
  • వరుణ్ తేజ్ కళ్లను చూసి తొలిసారి ప్రేమలో పడ్డానని వ్యాఖ్య
  • తనపై కేసు పెట్టి, మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన
  • కొణిదెల వారి కోడలిగా, వరుణ్ భార్యగా అదృష్టవంతురాలినని వ్యాఖ్య
ప్రముఖ నటి, కొణిదెల వారి కోడలు లావణ్య త్రిపాఠి తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత ‘సతీ లీలావతి’ చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో తాను కూడా వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు.

కెరీర్ ఆరంభంలో ఓ తమిళ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడనీ దాంతో ఆ సినిమానే వదులుకున్నానని, దీనిపై చిత్రబృందం తన మీద కేసు పెట్టిందన్నారు. అంతటితో ఆగకుండా మీడియాలోనూ తప్పుడు కథనాలు రాయించారని, ఆ ఘటనతో మానసికంగా తాను కుంగిపోయానని తెలిపింది. అలాగే, బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘గీత గోవిందం’ చిత్రంలో హీరోయిన్‌గా తొలి అవకాశం తనకే వచ్చిందని, అయితే ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ ఆఫర్‌ను వదులుకోవాల్సి వచ్చిందని లావణ్య వెల్లడించారు.

ఇక వరుణ్ తేజ్‌తో తన ప్రేమ, వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ, “ఒక సినిమా వేడుకలో వరుణ్ కళ్లను చూసి ప్రేమలో పడ్డాను. ఆయన చాలా సపోర్టివ్‌గా ఉంటారు. మా మధ్య గొడవ వస్తే తను వాదిస్తాడు, నేను మౌనంగా ఉండిపోతాను. వరుణ్ లాంటి భర్త దొరకడం, మెగా కుటుంబంలోకి రావడం నా అదృష్టం” అని లావణ్య త్రిపాఠి తెలిపారు.
 

Lavanya Tripathi
Varun Tej
Sati Leelavathi
Geetha Govindam
Tamil director harassment
Telugu cinema
Mega family
Tollywood
Movie offer
Personal life

More Telugu News