మంత్రి సీతక్కకు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విజ్ఞప్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి సీతక్కకు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విజ్ఞప్తి

Kavitha Requests Minister Seethakka on Sree Nidhi Corruption
స్త్రీ నిధిలో జరుగుతున్న అక్రమాలపై స్పందించాలన్న కవిత
స్త్రీనిధిలో అక్రమాలకు కేంద్ర బిందువైన ఎండీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
సంస్థను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఎక్స్ అఫీషియో ఛైర్మన్ పదవిని కొట్టేయడానికి స్కెచ్ వేశాడని ఆరోపణ
మంత్రి సీతక్కకు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక విజ్ఞప్తి చేశారు. ఆమె శాఖలో జరుగుతున్న అక్రమాలపై స్పందించాలని కోరారు. స్త్రీనిధిలో అక్రమాలకు కేంద్ర బిందువైన సంస్థ ఎండీపై చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ మేరకు కవిత 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పాటునివ్వాల్సిన స్త్రీనిధి సంస్థ అక్రమార్కులకు అడ్డంగా మారిందని ఆరోపించారు.

సంస్థను తన గుప్పెట్లో పెట్టుకుని అనేక అక్రమాలకు కారకుడైన ఎండీ, ఇప్పుడు దొడ్డిదారిన సంస్థకు ఎక్స్ అఫీషియో ఛైర్మన్ పదవిని కొట్టేయడానికి స్కెచ్ వేశారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ నెల 16వ తేదీన స్త్రీనిధి ఉద్యోగుల సమావేశంలో ఎక్స్ అఫీషియో చైర్మన్ పోస్టును తీసుకోవడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని పేర్కొన్నారు.

సదరు ఎండీ పదవీకాలం ఈ నెల 23వ తేదీతో ముగియనుందని, దీంతో ఆయన సంస్థను ఎలాగైనా తన అధీనంలోనే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమార్కులను దొడ్డిదారిలో కీలక పోస్టుల కొనసాగించేందుకు ఎంతకైనా దిగజారుతోందని విమర్శించారు.

తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై మంత్రి సీతక్క స్పందించాలని కోరారు. స్త్రీ నిధిలో అక్రమాలకు కేంద్ర బిందువైన సంస్థ ఎండీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్త్ర నిధిలో నియామకాలు పారదర్శకంగా జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.
Advertisement
Kavitha
Kalvakuntla Kavitha
Seethakka
Telangana Rakshana Sena
TRS
Sree Nidhi
Telangana

More Telugu News