గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన విద్యార్థిని

13-05-2026 Wed 17:04 | National
Advertisement
  • మంగళూరులో రూ. 35 లక్షల విలువైన గంజాయితో బీసీఏ విద్యార్థిని అరెస్ట్
  • నిందితురాలు సుహానా నుంచి 1.40 కిలోల హైబ్రిడ్ గంజాయి స్వాధీనం
  • చెన్నై నుంచి గంజాయి తెచ్చి విద్యార్థులకు అమ్ముతున్నట్టు గుర్తింపు
  • నిందితురాలిపై గతంలోనూ బెంగళూరు, మంగళూరులో పలు కేసులు ఉన్నాయి
  • కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ముల్కి పోలీసులు
Advertisement
కర్ణాటకలో డ్రగ్స్ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మంగళూరు నగరంలో భారీగా గంజాయి రవాణా చేస్తున్న ఓ బీసీఏ విద్యార్థినిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు. నిందితురాలి నుంచి రూ. 35 లక్షల విలువైన హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, శివమొగ్గ జిల్లా సాగర్‌కు చెందిన 21 ఏళ్ల సుహానా.. ఉడిపి జిల్లా కుందాపురలోని ఓ ప్రముఖ కళాశాలలో బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చెన్నై నుంచి గంజాయిని తీసుకువచ్చి మంగళూరులోని కాలేజీ విద్యార్థులు, ధనవంతులకు అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పనంబూరు, ముల్కి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.

మంగళవారం ముల్కి రైల్వే స్టేషన్ రోడ్డులో గంజాయి అమ్ముతుండగా సుహానాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి 1.40 కిలోల హైబ్రిడ్ గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయికి మార్కెట్లో అధిక విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో సుహానాపై గతంలోనూ బెంగళూరు, మంగళూరులలో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్టు తేలింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద కవూరు పోలీస్ స్టేషన్‌లో, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం కూడా ఆమెపై గతంలో కేసులు నమోదు చేశాయి. ప్రస్తుత ఘటనపై ముల్కి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Advertisement
SuhanaMangaloreGanja SmugglingKarnataka DrugsBCA Student ArrestedHybrid GanjaNDPS ActMulki PoliceChennaiDrug Trafficking

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more