ఈ రోజునే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ క్రైమ్ థిల్లర్!
- భరత్ హీరోగా రూపొందిన 'కాళిదాస్ 2'
- గతంలో వచ్చిన 'కాళిదాస్'కి ఇది సీక్వెల్
- ఏప్రిల్ లో ప్రేక్షకులను పలకరించిన కంటెంట్
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు
చెప్పుకోదగిన కంటెంట్ తో వచ్చిన తమిళంలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో 'కాళిదాస్' ఒకటిగా కనిపిస్తుంది. భరత్ హీరోగా రూపొందిన ఈ సినిమా 2019లో థియేటర్లకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి తెగనచ్చేసిన కథ ఇది. అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందినదే 'కాళిదాస్ 2'. ఏప్రిల్ 3వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అలాంటి ఈ సినిమా 7 ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి రావడం విశేషం. అమెజాన్ ప్రైమ్ .. సన్ నెక్స్ట్ .. లయన్స్ గేట్ ప్లే .. ఆహా తమిళ్ .. ఇలా ఏడు ఓటీటీలలో ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఏడు ఓటీటీలలో కూడా ఈ సినిమా తెలుగులో అందుబాటులోకి రాలేదు .. త్వరలో తెలుగు ఆడియోను జోడించే అవకాశం ఉంది. శ్రీ సెంథిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సంగీత మాధవన్ నాయర్ .. అబర్నతి .. ప్రకాశ్ రాజ్ .. భవానీ శ్రీ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
కథ విషయానికి వస్తే .. ఒక వైపున న్యూ ఇయర్ వేడుకలు సందడిగా సాగుతుంటే, శ్రీమంతుల కుటుంబానికి చెందిన ఒక పాప మిస్సవుతుంది. గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఆ పాప మిస్సవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ కేసును పరిష్కరించడానికి పోలీస్ ఆఫీసర్ కాళిదాస్ రంగంలోకి దిగుతాడు. ఈ కేసును ఛేదించే విషయంలో ఆయనకి ఎదురయ్యే సవాళ్లే మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి మంచి మార్కులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.