'వారణాసి' లేటెస్ట్ షెడ్యూల్ మళ్లీ మొదలైంది... సెట్స్ పై ప్రియాంక చోప్రా!

Priyanka Chopra Joins Varanasi Movie Latest Schedule
మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో 'వారణాసి'
హీరోయిన్ గా ప్రియాంక చోప్రా
లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైనట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడి
ఇటీవల హైదరాబాద్‌లో నీటి కొరతతో నిలిచిన షెడ్యూల్! 
2027 ఏప్రిల్ 7న వస్తున్న 'వారణాసి'
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'పై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజా షెడ్యూల్ లో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

"వారణాసి, హియర్ వి గో!" అనే క్యాప్షన్‌తో ఆమె ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో, కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లు అధికారికంగా వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో నీటి కొరత కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన షూటింగ్‌ను ఇప్పుడు పునఃప్రారంభించారు. తాజా అప్‌డేట్‌తో ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు మాధవన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. కార్తికేయ, కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
Go Back to Shorts
Priyanka Chopra
Mahesh Babu
SS Rajamouli
Varanasi Movie
Prithviraj Sukumaran
Telugu cinema
Indian cinema
Action Adventure Movie
MM Keeravani
Prakash Raj

More Telugu News