అమెరికాలో హైదరాబాద్ యువతి విషాదాంతం
- ఫ్లోరిడాలో స్విమ్మింగ్ పూల్లో పడి హైదరాబాద్ యువతి వీణ మరణం
- మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వ సహాయం కోరిన వీణ కుటుంబం
- లింగోజిగూడ డివిజన్ లో వీణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి అకాల మరణం చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫ్లోరిడాలో హైదరాబాద్కు చెందిన యువతి ప్రమాదవశాత్తు మరణించింది.
వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నియోజకవర్గం లింగోజిగూడకు చెందిన వీణ, వర్జీనియాలో నివసిస్తున్నారు. ఫ్లోరిడాలో ఒక ఫంక్షన్కు హాజరయ్యేందుకు వెళ్లిన ఆమె, ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మరణించారు. ఈ విషయం తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వీణ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. వీణ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.