హర్మూజ్ మీదుగా వెళ్తూ అదృశ్యమైన అమెరికా ‘ఫ్లైయింగ్ గ్యాస్ స్టేషన్’ విమానం
- రాడార్ నుంచి మాయమవడానికి ముందు అత్యవసర సిగ్నల్
- ఖతార్ వైపు వెళ్తుండగా హర్మూజ్ జలసంధి సమీపంలో ఘటన
- అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆందోళన
గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. అమెరికా వైమానిక దళానికి చెందిన కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానం అత్యవసర పరిస్థితిని సూచించే సిగ్నల్ పంపిన కాసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైంది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఉద్రిక్తతకు దారితీస్తోంది.
ఫ్లైట్ ట్రాకింగ్ వ్యవస్థల సమాచారం ప్రకారం ఈ విమానం గల్ఫ్ గగనతలంపై ఇంధనం నింపే కార్యకలాపాల్లో ఉండగా, ప్రమాదాన్ని సూచించే 7700 స్క్వాక్ కోడ్‌ను ప్రసారం చేసింది. అనంతరం తన మార్గాన్ని మార్చుకుని ఖతార్‌లోని సైనిక స్థావరం వైపు పయనిస్తున్నట్లు కనిపించింది. అయితే, ఎమర్జెన్సీ కోడ్ పంపిన గంట తర్వాత దాని ట్రాన్స్‌పాండర్ సిగ్నల్ పూర్తిగా నిలిచిపోయిందని ‘గల్ఫ్ న్యూస్’ కథనం వెల్లడించింది.
గాలిలో ఇతర విమానాలకు ఇంధనం నింపే సామర్థ్యం ఉన్నందున ఈ విమానాన్ని ‘ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్’ అని పిలుస్తారు. సాధారణంగా యాంత్రిక లోపాలు, విమానంలో మంటలు, లేదా బాహ్య ముప్పు వంటి సందర్భాల్లో 7700 కోడ్‌ను ఉపయోగిస్తారు. పశ్చిమాసియాలో ఘర్షణల తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సిగ్నల్ కోల్పోయినంత మాత్రాన విమానం కూలిపోయిందని నిర్ధారించలేనప్పటికీ, ఎమర్జెన్సీ సిగ్నల్ తర్వాత అదృశ్యం కావడం తీవ్రమైన ఘటన జరిగి ఉండవచ్చనే అనుమానాలను బలపరుస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఎలాంటి శిథిలాలు లభించలేదు. సహాయక చర్యలపై కూడా ఎటువంటి సమాచారం లేదు. గతంలో ఇరాన్ పలు అమెరికా విమానాలను కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.