ఉదయనిధి స్టాలిన్ గెలుపు, మూడో స్థానానికి పరిమితమైన మాజీ గవర్నర్ తమిళిసై
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉదయనిధి స్టాలిన్ గెలుపు, మూడో స్థానానికి పరిమితమైన మాజీ గవర్నర్ తమిళిసై

Udhayanidhi Stalin Wins Chepauk Thiruvallikeni Constituency
  • టీవీకే పార్టీ అభ్యర్థి సెల్వంపై గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్
  • 7,140 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం
  • మైలాపూర్‌లో గెలుపొందిన విజయ్ పార్టీ అభ్యర్థి
చెపాక్ తిరువెళ్లికేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే పార్టీ యువనాయకుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. సమీప తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అభ్యర్థి సెల్వంపై 7,140 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సెల్వం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరారు. ఉదయనిధి స్టాలిన్‌కు 62,992 ఓట్లు రాగా, సెల్వంకు 55,852 ఓట్లు వచ్చాయి. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థికి 16 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి చెందారు. ఆయన తనయుడు ఉదయనిధి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో డీఎంకే పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు, మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ మాజీ అధ్యక్షురాలు, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓడిపోయారు. ఈ నియోజకవర్గం నుంచి టీవీకే పార్టీ అభ్యర్థి వెంకటరామనన్ సమీప డీఎంకే అభ్యర్థిపై 28 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. తమిళిసై మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆమెకు 32,328 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Advertisement
Udhayanidhi Stalin
Chepauk Thiruvallikeni
Tamil Nadu Elections
DMK Party
Tamilisai Soundararajan
TVK Party
Mylapore Constituency
Tamiliga Vetri Kazhagam
MK Stalin
Assembly Elections

More Telugu News