పెళ్లి వేడుకలో డీజే వాయించి, డ్యాన్స్ చేసిన అమెరికా విదేశాంగ మంత్రి

US Secretary of State Marco Rubio Plays DJ at Wedding
  • విదేశాంగ మంత్రిగా, జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వహిస్తున్న మార్కో
  • మియామిలోని పెళ్లి వేడుకకు హాజరైన మార్కో రుబియో
  • హెడ్ ఫోన్స్ ధరించి డిజే కన్సోల్‌ను ఆపరేట్ చేసిన మార్కో రుబియో
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఓ పెళ్లికి హాజరయ్యారు. అక్కడ డీజే ప్లే చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. మార్కో రుబియో విదేశాంగ మంత్రిగా, జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వహిస్తున్నారు.

ఎంతో బిజీ షెడ్యూల్‌తో ఉండే ఆయన, ఇటీవల మియామిలోని ఒక నైట్ క్లబ్‌లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్ళికి హాజరైన వారిలో చాలామంది అక్కడ ఏర్పాటు చేసిన డీజేకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. దీంతో మార్కో రుబియో కూడా డీజేను వాయించి డ్యాన్స్ చేసేవారిని మరింత ఉత్సాహపరిచారు. హెడ్ ఫోన్స్ ధరించి డిజే కన్సోల్‌ను ఆపరేట్ చేశారు. డీజే వద్దనే అందరితోపాటు ఆయన కూడా కాలు కదిపారు.
Advertisement
Marco Rubio
US Secretary of State

More Telugu News