సలాం సన్‌రైజర్స్... ముంబైపై సంచలన ఛేజింగ్ విజయం
- ముంబైపై 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
- 244 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించిన ఎస్ఆర్‌హెచ్
- విధ్వంసం సృష్టించిన ట్రావిస్ హెడ్ (76), అభిషేక్ శర్మ (45)
- రాణించిన క్లాసెన్ (65*), చివర్లో మెరిసిన సలీల్ అరోరా (30*)
- ముంబై ఇండియన్స్ బ్యాటర్ రియాన్ రికెల్టన్ సెంచరీ (123*) వృథా
ఐపీఎల్‌లో మరోసారి పరుగుల సునామీ సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌పై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసానికి, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా మెరుపులు తోడవడంతో సన్‌రైజర్స్ 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై బ్యాటర్ రియాన్ రికెల్టన్ అద్భుత శతకం వృథా అయింది.
244 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తిరుగులేని ఆరంభాన్ని అందించారు. తొలి బంతి నుంచే ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడీ, పవర్‌ప్లేలోనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. వీరిద్దరూ కలిసి కేవలం 8.4 ఓవర్లలోనే 129 పరుగుల విధ్వంసకర భాగస్వామ్యం నెలకొల్పి గెలుపునకు బలమైన పునాది వేశారు. ట్రావిస్ హెడ్ కేవలం 30 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 24 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 45 పరుగులు సాధించి అతనికి అండగా నిలిచాడు.
అయితే, 129 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఔటైన తర్వాత, సన్‌రైజర్స్ స్వల్ప వ్యవధిలో ఇషాన్ కిషన్ (0), ట్రావిస్ హెడ్ వికెట్లను కోల్పోయి కాస్త తడబడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (30 బంతుల్లో 65 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (17 బంతుల్లో 21)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. క్లాసెన్ తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని తగ్గకుండా చూసుకున్నాడు.
నితీశ్ ఔటయ్యాక, కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ సలీల్ అరోరా తన సత్తా చాటాడు. కేవలం 10 బంతుల్లో 1 ఫోర్, 3 భారీ సిక్సర్లతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా అతను బాదిన సిక్సర్లు మ్యాచ్‌ను ఎస్ఆర్‌హెచ్ వైపు పూర్తిగా తిప్పేశాయి. హార్దిక్ పాండ్యా విసిరిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సలీల్ అరోరా ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాదడంతో సన్ రైజర్స్ విజయతీరాలకు చేరింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రియాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 55 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 123 పరుగులు చేసి ముంబైకి భారీ స్కోరు అందించాడు. అతనికి తోడుగా విల్ జాక్స్ (22 బంతుల్లో 46), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 31) రాణించారు. అయితే, బౌలర్లు పూర్తిగా విఫలమవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.