కవితకు 'టీఆర్ఎస్' షాక్.. పార్టీ పేరును రిజిస్టర్ చేయవద్దని ఈసీకి లేఖ!

కవితకు 'టీఆర్ఎస్' షాక్.. పార్టీ పేరును రిజిస్టర్ చేయవద్దని ఈసీకి లేఖ!

Telangana Rajya Samithi chief letter to EC
  • ఈసీకి తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడి లేఖ
  • 2023లోనే తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్)ని రిజిస్టర్ చేయించినట్లు వెల్లడి
  • టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీని రిజిస్టర్ చేస్తే తనకు నష్టం జరుగుతుందని వెల్లడి
తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ అధినేత్రి కవితకు తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం షాకిచ్చారు. కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారడంతో బాలరంగం తన పార్టీని 2023లో రిజిస్టర్ చేయించారు. ఈ నేపథ్యంలో కవిత 'టీఆర్ఎస్' పార్టీని రిజిస్టర్ చేయవద్దని, అలా చేస్తే తన పార్టీకి నష్టం జరుగుతుందని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

తన టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల సంఘం 2023లో రిజిస్టర్ చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుతో పది నియోజకవర్గాల్లో పోటీ చేసినట్లు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన తుపాకుల బాలరంగం 'టీఆర్ఎస్' సంక్షిప్త నామంతో పార్టీని స్థాపించారు. బహుజనులకు రాజ్యాధికారం లక్ష్యంగా పార్టీని స్థాపించారు.

కవిత నాలుగు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. పాతికేళ్ల క్రితం కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ సంక్షిప్త నామం వచ్చేలా ఆమె పార్టీని ప్రకటించారు.
Advertisement
Telangana Rajya Samithi chief letter to EC
TRS chief letter over Kavitha party

More Telugu News