బౌండరీలో 10 మంది ఉన్నా ఆపలేరు.. వైభవ్‌పై గవాస్కర్ ప్రశంసలు

  • పంజాబ్‌పై 16 బంతుల్లో 43 పరుగులు చేసిన 15 ఏళ్ల వైభవ్ 
  • ఈ సీజన్‌లో 400 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు
  • వైభవ్‌ను 10 మంది ఫీల్డర్లతోనూ ఆపలేమన్న సునీల్ గవాస్కర్
  • వైభవ్ ఏమాత్రం ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపించడం లేదన్న స‌న్నీ
  • అత‌నికి దేని గురించీ ఆందోళన లేదు.. ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కూడా పట్టించుకోడని వ్యాఖ్య‌
 
ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు చేసి పెను సంచలనం సృష్టించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో, ఈ ఐపీఎల్ సీజన్‌లో 400 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు.

వైభవ్ ఆడిన తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. "అతడు ఆడిన షాట్లు అద్భుతం. బౌండరీ వద్ద 10 మంది ఫీల్డర్లను పెట్టినా అతడిని ఆపడం అసాధ్యం. వైభవ్ ఏమాత్రం ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపించడం లేదు. చిన్న వయసులో ఉండటం వల్లే ఈ ప్రయోజనం. దేని గురించీ ఆందోళన చెందడు, ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కూడా పట్టించుకోడు" అని గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్‌లో వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఛేజింగ్‌కు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. యశస్వి జైస్వాల్ స్ట్రైక్ ఇవ్వగానే రెచ్చిపోయాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లోనే 6, 4, 4 బాది 15 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత ఫెర్గూసన్, యాన్సెన్ బౌలింగ్‌లోనూ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేశాక, అర్ష్‌దీప్ బౌలింగ్‌లోనే శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా (167 బంతుల్లో) 400 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. 

Sunil Gavaskar
Vaibhav Sooryavanshi
Rajasthan Royals
IPL 2026

More Telugu News