పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్

పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్

Pilot Rohit Reddy gets bail
  • మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి ఊరట
  • దాదాపు నెలన్నర రోజులుగా జైల్లో ఉన్న రోహిత్
  • రేపు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం

సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఊరట లభించింది. దాదాపు ఒకటిన్నర నెలలుగా జైలులో ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.


కేసు వివరాల్లోకి వెళితే... గత మార్చి 14వ తేదీ రాత్రి మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌పై పోలీసులు జరిపిన దాడుల్లో కొకైన్, విదేశీ మద్యం, ఇతర నిషేధిత వస్తువులు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి, వ్యాపారవేత్త నమిత్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు.


ఆ రాత్రి పార్టీలో పాల్గొన్న 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్‌గా తేలింది. ఈ కేసులో రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బెయిల్ ప్రక్రియ పూర్తి కావడంతో, రేపు చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement
Pilot Rohit Reddy
BRS

More Telugu News