పిల్లలపై ఒట్టేసి చెప్పు.. కవితకు తీన్మార్ మల్లన్న బహిరంగ సవాల్

Teenmar Mallanna Alleges That Secret Pact Between Revanth And Kavita To End Brs
  • కవిత కొత్త పార్టీ ఏర్పాటు వెనుక సీఎం రేవంత్ హస్తం ఉందంటున్న మ‌ల్ల‌న్న‌
  • బీఆర్ఎస్‌ను పూర్తిగా దెబ్బతీసేందుకే ఈ ఎత్తుగడ అని ఆరోపణ
  • రేవంత్ కేబినెట్‌లో మంత్రి పదవి కోసం కవిత ప్రయత్నించార‌ని వ్యాఖ్య‌
  • ఈ విషయం తెలిసే కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశార‌ని వెల్ల‌డి
  • కవిత చదివేది రేవంత్ స్క్రిప్ట్ అని, ఫండింగ్ కూడా ఆయనదేనని మల్లన్న వ్యాఖ్య
కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటు చేసిన 'తెలంగాణ రాష్ట్ర సేన' (టీఆర్ఎస్) పార్టీపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. ఈ పార్టీ ఏర్పాటు వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఖతం చేయడమే లక్ష్యంగా ఈ రాజకీయ వ్యూహం పన్నారని వ్యాఖ్యానించారు. కవిత మాట్లాడే ప్రతి మాట వెనుక రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ ఉందని, ఆమె పార్టీ కార్యక్రమాలకు అవసరమైన నిధులను కూడా ఆయనే సమకూరుస్తున్నారని మల్లన్న ఆరోపించారు.

ఈ సందర్భంగా కవితకు మల్లన్న నేరుగా సవాల్ విసిరారు. "మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌లతో పాటు నాలుగో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సింది మీరే కదా? ఈ విషయం నిజమో? కాదో? మీ పిల్లలపై ఒట్టేసి చెప్పాలి" అని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొందేందుకు కవిత ప్రయత్నించారని, ఈ విషయం కేసీఆర్, కేటీఆర్‌లకు తెలియడంతోనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మల్లన్న వివరించారు. ఇప్పుడు దానిని 'ఆత్మగౌరవ పోరాటం'గా చిత్రీకరించడం హాస్యాస్పదమని విమర్శించారు.

"బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి మీరు కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. మంత్రిగా మారటానికి వేసిన కుట్ర విఫలమైంది. ఇప్పుడు తెలంగాణ వాదం పేరుతో డ్రామాలు ఎందుకు? ఏఐసీసీలోని ఓ కీలక నేతతో మీరు టచ్‌లో ఉన్న మాట వాస్తవం కాదా?" అని మల్లన్న ప్రశ్నించారు. కేసీఆర్‌ను 'మర మనిషి' అంటూ కవిత చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ, ఆయన వదిలేసిన తెలంగాణ ఆత్మను కాపాడతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, కవిత కలిసి ఈ నాటకం ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలు, సవాళ్లపై కవిత, ఆమె కొత్త పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Go Back to Shorts
Teenmar Mallanna
MLC
Kavita
TRS
BRS
Revanth Reddy
Telangana

More Telugu News