ఇదేం కొట్టుడు... 6 ఒవర్లలో 116 పరుగులు... ఒకే ఓవర్లో 6 ఫోర్లు!

Prabhsimran Singh Punjab Kings Score 116 Runs in 6 Overs vs Delhi
  • ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్
  • పంజాబ్ కింగ్స్ ముందు 265 పరుగుల భారీ టార్గెట్
  • ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్, ప్రియాంశ్
  • ముఖేష్ కుమార్ వేసిన ఒకే ఓవర్లో ఆరు ఫోర్లతో 24 పరుగులు సాధించిన ప్రభ్‌సిమ్రాన్
  • కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ఓపెనర్
ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య సృష్టించిన విధ్వంసానికి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల వరద పారింది. 265 పరుగుల భారీ లక్ష్యం నేపథ్యంలో... పవర్‌ప్లేలో ఈ జోడీ ఆడిన తీరు అసాధారణం. తొలి 6 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 116 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.

ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న అతను, ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన ముఖేష్ కుమార్‌ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ ఓవర్‌లోని ఆరు బంతులను ఫోర్లుగా మలిచి ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. స్లోయర్ బంతులు, ఫుల్ టాస్‌లు, షార్ట్ బాల్స్.. ఇలా బంతి ఎలా వేసినా బౌండరీ దాటించడమే పనిగా పెట్టుకున్నాడు. మరోవైపు, ప్రియాంశ్ ఆర్య కూడా దూకుడుగా ఆడి ప్రభ్‌సిమ్రాన్‌కు అద్భుతమైన సహకారం అందించాడు.

చివరికి ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కాగా... ప్రియాంశ్ ఆర్య 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు. 

అయితే, ఈ మ్యాచ్‌లో ఒక విచారకర ఘటన చోటుచేసుకుంది. రెండో ఓవర్లో ప్రియాంశ్ ఆర్య కొట్టిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఢిల్లీ ఫీల్డర్ లుంగి ఎంగిడి తలకు తీవ్ర గాయమైంది. కింద పడే క్రమంలో అతని తల గట్టిగా నేలను తాకడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య సిబ్బంది వచ్చి అతడిని స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
Go Back to Shorts
Prabhsimran Singh
Punjab Kings
IPL
Delhi Capitals
Priansh Arya
Arun Jaitley Stadium
Mukesh Kumar
Lungi Ngidi
Cricket
Powerplay

More Telugu News