ప్యారిస్‌లో వింత స్కామ్.. బెట్టింగ్‌ల కోసం టెంపరేచర్ ట్యాంపరింగ్!

25-04-2026 Sat 10:02 | International
Advertisement
  • ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణ సెన్సార్‌తో ట్యాంపరింగ్ 
  • పాలీమార్కెట్ బెట్టింగ్‌లో గెలిచేందుకు జరిగిన మోసం 
  • రెండుసార్లు ఉష్ణోగ్రతలు మార్చి వేల డాలర్లు కొల్లగొట్టిన యూజర్లు 
  • హెయిర్ డ్రైయర్ ఉపయోగించి ఉంటారని అనుమానాలు 
  • వాతావరణ సంస్థ ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు ప్రారంభం
Advertisement
ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌లోని అత్యంత రద్దీ విమానాశ్రయం, చార్లెస్ డి గాల్‌లో ఓ వింత మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కోసం ఇక్కడి వాతావరణ సెన్సార్‌ను ట్యాంపర్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ జాతీయ వాతావరణ సంస్థ 'మెటియో ఫ్రాన్స్' అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానాశ్రయంలోని ఆటోమేటెడ్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్‌ను ఉద్దేశపూర్వకంగా మార్పులు చేశారని, దీనిపై దర్యాప్తు జరపాలని కోరింది.

అస‌లేం జరిగింది?
అమెరికన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ అయిన 'పాలీమార్కెట్‌'లో నగరాల రోజువారీ గరిష్ఠ ఉష్ణోగ్రతలపై పందాలు కాస్తుంటారు. ఏప్రిల్ నెలలో రెండు వేర్వేరు సందర్భాల్లో ప్యారిస్ ఉష్ణోగ్రతలపై పందెం కాసిన కొందరు యూజర్లు భారీ మొత్తంలో డబ్బు గెలుచుకున్నారు.

ఏప్రిల్ 6న సాయంత్రం 7 గంటల సమయంలో చార్లెస్ డి గాల్ ఎయిర్‌పోర్ట్‌లోని సెన్సార్‌లో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా 22 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. వాస్తవానికి ఆ రోజు సగటు ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా ఉంది. ఈ ఊహించని పెరుగుదలపై పందెం కాసిన ఒక యూజర్ 14,000 డాల‌ర్లు (దాదాపు రూ. 11.6 లక్షలు) గెలుచుకున్నాడు. సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత ఏప్రిల్ 15న మళ్లీ అదే తరహాలో ఉష్ణోగ్రత 22 డిగ్రీలకు చేరింది. ఈసారి మరో యూజర్ ఏకంగా 20,000 డాల‌ర్లు (సుమారు రూ. 16.6 లక్షలు) గెలుపొందాడు.

హెయిర్ డ్రైయర్‌తో ట్యాంపరింగ్?
ఈ అసాధారణ మార్పులను ఫ్రాన్స్‌కు చెందిన 'ఇన్ఫోక్లైమేట్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ గుర్తించి, వాతావరణ అధికారులను అప్రమత్తం చేసింది. బ్యాటరీతో పనిచేసే హెయిర్ డ్రైయర్‌ను సెన్సార్ వద్ద ఉపయోగించి ఉష్ణోగ్రతను కృత్రిమంగా పెంచి ఉండవచ్చని కొందరు వాతావరణ నిపుణులు ఫోరమ్‌లలో అనుమానం వ్యక్తం చేశారు. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మెటియో ఫ్రాన్స్ ఫిర్యాదు మేరకు చార్లెస్ డి గాల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, పాలీమార్కెట్ వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలను కచ్చితంగా అంచనా వేసి ఒక ట్రేడర్ దాదాపు మిలియన్ డాలర్లు సంపాదించడం ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు దారితీసింది. తాజా ఘటనతో వాతావరణ డేటా భద్రతపై కూడా కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Temperature TamperingCharles de Gaulle AirportParisFranceonline bettingPolymarketweather dataMeteo Franceairport scam

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more