బీజేపీలోకి వెళ్తారని ప్రచారం.. స్పందించిన జీవన్ రెడ్డి

Jeevan Reddy responds on Joining BJP
  • ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
  • ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్న జీవన్ రెడ్డి
  • నా రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బీజేపీలోకి చేరతారని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోందని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి తనపై కుట్ర చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ వెంటే ఉంటానని అన్నారు. ఆయన నాయకత్వంలో పని చేయడం తనకు గర్వకారణమని అన్నారు. తాను బీజేపీలో చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలు, అభిమానులు ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే సైనికుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.
Go Back to Shorts
BRS leader Jeevan reddy on party change
BRs leader Jeevan reddy

More Telugu News