ఓటీటీలో దూసుకుపోతున్న కన్నడ క్రైమ్ థ్రిల్లర్!

Entertainment
Advertisement
  • కన్నడలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్
  • పోలీస్ ఆఫీసర్ గా మెప్పించిన విజయ్ రాఘవేంద్ర
  • ఈ నెల 17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో
  • త్వరలో తెలుగులోను అందుబాటులోకి
Advertisement
కన్నడ నుంచి వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో ఇప్పుడు దూసుకుపోతోంది. థియేటర్ల నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్న ఆ సినిమా పేరే 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్'. విజయ్ రాఘవేంద్ర కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ఇది. కన్నడలో విజయ్ రాఘవేంద్రకి మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు వైవిధ్యభరితంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. తన ఓటీటీ సినిమాల ద్వారా ఈ మధ్యనే ఆయన ఇతర భాషా ప్రేక్షకులకు చేరువవుతున్నాడు. 

అలాంటి విజయ్ రాఘవేంద్ర పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాకి దేవిప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించాడు. ప్రసాద్ - సాత్త్విక్ నిర్మించిన ఈ సినిమా, ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లకు వచ్చింది. కంటెంట్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ రాఘవేంద్ర నటనకి ప్రశంసలు దక్కాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ప్రస్తుతం కన్నడ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు ఆడియోలోను అందుబాటులోకి రానుందని అంటున్నారు. 
         
కథ విషయానికి వస్తే .. విలేజ్ నేపథ్యంలో .. 'అనెగుండ్ల' పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కథ నడుస్తుంది. ఆ ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. కాళ్లు - చేతులు కట్టేసి చాలా దారుణంగా హత్య చేస్తుంటారు. దాంతో చీకటిపడితేచాలు, అక్కడివారు బయటకి వెళ్లడానికి భయపడుతుంటారు. అలాంటి పరిస్థితులలో, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరున్న 'సీతారామ్' రంగంలోకి దిగుతాడు. ఆయన ఈ కేసును ఎలా ఛేదిస్తాడు? అనేదే కథ.

Advertisement

సంబంధిత వార్తలు

Vijay RaghavendraSecond Case of SitaramKannada crime thrillerOTT movieAmazon PrimeAnnegundla police stationcrime investigationTelugu dubbingDevi Prasad ShettyKannada cinema

More Telugu News

మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి పొన్నం

04 Nov, 10:54

‘‘నేను నేరుగా బరిలో ఉంటేనా’’.. మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ట్రంప్‌ తొలి స్పందన!

04 Nov, 10:52

నా ఫేవరెట్ కెప్టెన్లు ఆ ఇద్ద‌రే.. నా కెప్టెన్సీ మాత్రం కష్టకాలంలో గడిచింది: సచిన్

04 Nov, 10:50

అమెరికా మధ్యంతర ఎన్నికలు: ఫ్లోరిడాలో భారత సంతతి మహిళ పియా దండియా ఘన విజయం

04 Nov, 10:42

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి కొత్త సారథి

04 Nov, 10:39

'రామాయణం' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనం.. రూ.100 కోట్లకు చేరువలో!

04 Nov, 10:38

చలి ఉదయం.. పక్షవాతానికి సమయం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

04 Nov, 10:35

రేపటి పరిషత్ పోలింగ్‌పై ఉత్కంఠ.. నేడు తుది నిర్ణయం

04 Nov, 10:20

నాగార్జున సినిమాలో టబు విశ్వరూపం.. పుట్టినరోజున అదిరిపోయే సర్‌ప్రైజ్‌

04 Nov, 10:17

ఏబీ వెంకటేశ్వరరావుకు ఎన్నికల్లో తీవ్ర నిరాశ.. డిపాజిట్ గల్లంతు

04 Nov, 10:13

డెంగ్యూకి చెక్.. 2027లో భారత్‌లో తొలి వ్యాక్సిన్ 'క్విడెంగా' విడుదల

04 Nov, 10:11

వివేక్‌ రామస్వామికి ఎదురుదెబ్బ.. 20 ఏళ్ల తర్వాత ఒహాయోలో డెమోక్రాట్ల విజయం!

04 Nov, 10:01

తమిళ సినీ పరిశ్రమకు సీఎం విజ‌య్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై రోజుకు 6 షోలు!

04 Nov, 09:58

కేసీఆర్‌కు పేరు వస్తుందనే నీళ్లివ్వడం లేదు: వేముల ప్రశాంత్ రెడ్డి

04 Nov, 09:38

ఫుట్‌బాల్ స్టేడియంలో ఉద్రిక్తత.. ఆర్మీ హెలికాప్టర్‌ను తాకినంత పనిచేసిన బాణసంచా.. షాకైన ప్రేక్షకులు!

04 Nov, 09:36
..More Telugu News