ప్రియుడి కోసం తండ్రికి షాక్... కిలో బంగారం మాయం చేసిన కూతురు!

22-04-2026 Wed 10:27 | Telangana
Advertisement
  • యజమాని కూతురితో ప్రేమ నాటకమాడిన మేనేజర్ సాగర్
  • బ్రెయిన్ ట్యూమర్ అంటూ నమ్మించి ఆర్థిక సహాయం కోరిన వైనం
  • ప్రియుడి మాటలు నమ్మి కిలో బంగారం ఇచ్చిన యువతి
  • పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన మోసం
  • నిందితుడి అరెస్ట్.. 20 తులాల బంగారం రికవరీ
Advertisement
నమ్మకంగా పనిచేస్తున్నాడనుకున్న వ్యక్తే యజమాని కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు. ప్రేమ పేరుతో యజమాని కుమార్తెను వంచించి, ఆమె నుంచి ఏకంగా కిలో బంగారు ఆభరణాలను కాజేశాడు. బ్రెయిన్ ట్యూమర్ అంటూ నాటకమాడి ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి చైతన్యపురిలో టైల్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన వద్ద 34 ఏళ్ల సాగర్ గత నాలుగేళ్లుగా మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నమ్మకంగా ఉంటూ యజమాని కుటుంబంతో కలిసిపోయాడు. ఈ క్రమంలోనే యజమాని కుమార్తెతో పరిచయం పెంచుకుని, ఆమెను ప్రేమ పేరుతో తనవైపు తిప్పుకున్నాడు. సాగర్‌కు అప్పటికే పెళ్లయ్యి ఒక పాప కూడా ఉండటం.. ఇంట్లో ఒకడిలా చూసుకుంటుండటంతో యజమానికి అతడి ప్రవర్తన పట్ల అనుమానం రాలేదు.

కొంతకాలం తర్వాత తన పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు. తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ ఆమె ముందు కన్నీటిపర్యంతమయ్యాడు. అతని మాటలను పూర్తిగా నమ్మిన ఆ యువతి, ప్రియుడిని కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా లాకర్‌లో ఉన్న కిలో బంగారు ఆభరణాలను తీసుకెళ్లి అతనికి ఇచ్చింది.

ఆ బంగారంలో కొంత అమ్మి అప్పులు తీర్చుకున్న సాగర్, మిగిలిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపడం ప్రారంభించాడు. ఖరీదైన దుస్తులు, వస్తువులు కొంటూ తన జీవనశైలిని మార్చుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ నెల 17న వ్యాపారి కుటుంబం తమ సొంతూరు వెళ్లేందుకు సిద్ధమవుతూ లాకర్‌ను పరిశీలించగా, కిలో బంగారం కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులను విచారించగా, కుమార్తె ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఆమెను లోతుగా ప్రశ్నించడంతో అసలు విషయం వెల్లడించింది. ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడు సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 20 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
HyderabadChaitanyapuriGold theftBrain tumor scamTiles businessLove fraudCrime newsTelangana policeFinancial fraud

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more