అనంతబాబు కోసం పోలీసుల వేట.. పరారీలో వైకాపా ఎమ్మెల్సీ!

Andhra
Advertisement
  • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో కేసు
  • సాక్షులను బెదిరించారన్న ఆరోపణలతో పోలీసుల గాలింపు
  • రాత్రి కాకినాడలోని నివాసంలో పోలీసుల సోదాలు
  • అప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబు పరారైనట్లు గుర్తింపు
  • ఈ కేసులో అనంతబాబు అనుచరుడు ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తన మాజీ డ్రైవర్, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై కొత్తగా కేసు నమోదైంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కాకినాడలోని ఆయన నివాసానికి పోలీసులు చేరుకోగా, అప్పటికే ఆయన పరారైనట్లు తేలింది.

సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారని, కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తమకు డబ్బు ఆశ చూపి, ప్రాణహాని తలపెడతామని బెదిరించారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న అనంతబాబు అనుచరుడు మాగంటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

2022లో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఆయన బయట ఉన్నారు. అయితే, సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ఆయన్ను గతంలోనే హెచ్చరించింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఈ హత్య కేసులో అభియోగాల నమోదు జరగాల్సి ఉండగా, అంతకు ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మంగళవారం రాత్రి పోలీసులు అనంతబాబు నివాసానికి వెళ్లినప్పుడు ఆయన కారు, గన్‌మెన్ అక్కడే ఉన్నారు. అయితే, పోలీసుల రాకను ముందే పసిగట్టిన ఆయన మోటార్‌సైకిల్‌పై పరారైనట్లు సమాచారం. పరారీలో ఉన్న ఎమ్మెల్సీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి పొన్నం

04 Nov, 10:54

‘‘నేను నేరుగా బరిలో ఉంటేనా’’.. మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ట్రంప్‌ తొలి స్పందన!

04 Nov, 10:52

నా ఫేవరెట్ కెప్టెన్లు ఆ ఇద్ద‌రే.. నా కెప్టెన్సీ మాత్రం కష్టకాలంలో గడిచింది: సచిన్

04 Nov, 10:50

అమెరికా మధ్యంతర ఎన్నికలు: ఫ్లోరిడాలో భారత సంతతి మహిళ పియా దండియా ఘన విజయం

04 Nov, 10:42

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి కొత్త సారథి

04 Nov, 10:39

'రామాయణం' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనం.. రూ.100 కోట్లకు చేరువలో!

04 Nov, 10:38

చలి ఉదయం.. పక్షవాతానికి సమయం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

04 Nov, 10:35

రేపటి పరిషత్ పోలింగ్‌పై ఉత్కంఠ.. నేడు తుది నిర్ణయం

04 Nov, 10:20

నాగార్జున సినిమాలో టబు విశ్వరూపం.. పుట్టినరోజున అదిరిపోయే సర్‌ప్రైజ్‌

04 Nov, 10:17

ఏబీ వెంకటేశ్వరరావుకు ఎన్నికల్లో తీవ్ర నిరాశ.. డిపాజిట్ గల్లంతు

04 Nov, 10:13

డెంగ్యూకి చెక్.. 2027లో భారత్‌లో తొలి వ్యాక్సిన్ 'క్విడెంగా' విడుదల

04 Nov, 10:11

వివేక్‌ రామస్వామికి ఎదురుదెబ్బ.. 20 ఏళ్ల తర్వాత ఒహాయోలో డెమోక్రాట్ల విజయం!

04 Nov, 10:01

తమిళ సినీ పరిశ్రమకు సీఎం విజ‌య్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై రోజుకు 6 షోలు!

04 Nov, 09:58

కేసీఆర్‌కు పేరు వస్తుందనే నీళ్లివ్వడం లేదు: వేముల ప్రశాంత్ రెడ్డి

04 Nov, 09:38

ఫుట్‌బాల్ స్టేడియంలో ఉద్రిక్తత.. ఆర్మీ హెలికాప్టర్‌ను తాకినంత పనిచేసిన బాణసంచా.. షాకైన ప్రేక్షకులు!

04 Nov, 09:36
..More Telugu News