పార్టీ ఫిరాయింపులకు బీజం వేసింది మీరే.. కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ నిప్పులు!

Telangana
Advertisement
  • రాష్ట్రంలో ఫిరాయింపుల సంస్కృతిని మొదలుపెట్టింది ఎవరో అందరికీ తెలుసన్న సంజయ్ కుమార్
  • తాము వేరే పార్టీతో కలిసి నడవడం అవినీతి ఎలా అవుతుందని ప్రశ్న
  • నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నానని వ్యాఖ్య
Advertisement

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన 'క్రాస్ బ్రీడ్, హైబ్రీడ్' వ్యాఖ్యలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. .. అసలు రాష్ట్రంలో ఫిరాయింపుల సంస్కృతిని మొదలుపెట్టింది ఎవరో ప్రజలకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం 'నీతి' అయినప్పుడు... ఇప్పుడు తాము వేరే పార్టీకి దగ్గరైతే 'అవినీతి' ఎలా అవుతుందని ప్రశ్నించారు.


నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నానని, జగిత్యాల జిల్లాకు గతంలో ఎవరు ఏం చేశారో లెక్కలు తీయడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు. వచ్చే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మళ్లీ జగిత్యాల నుంచే పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారన్న ప్రశ్నకు మాత్రం.. "ఆ విషయం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది" అంటూ ఆయన చాలా తెలివిగా దాటవేశారు.

Advertisement

సంబంధిత వార్తలు

Sanjay KumarCongressKTRBRS

More Telugu News

రేపే ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

04 Nov, 12:04

హిందూ-యూదుల బంధంతో ముస్లింలకు ముప్పట.. భారత్‌-ఇజ్రాయెల్‌ దోస్తీపై పాక్‌ అక్కసు!

04 Nov, 12:03

హ్యాపీనెస్ ఆల్వేస్.. టబుకు జాకీ ష్రాఫ్ స్పెషల్ బర్త్ డే విషెస్!

04 Nov, 12:00

వివేక్ రామస్వామికి వివాదాస్పద యాడ్ దెబ్బ.. ప్రత్యర్థిపై వ్యక్తిగత దాడి బెడిసికొట్టింది!

04 Nov, 11:57

ఫీల్డింగ్‌లో రో-కో మెరుపులు.. కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్‌.. రోహిత్‌ అదిరిపోయే రనౌట్‌!

04 Nov, 11:41

భారత పేసర్ల ధాటికి కివీస్ విలవిల.. తొలి వన్డేలో 185 పరుగులకే ఆలౌట్

04 Nov, 11:29

పోలవరం-బనకచర్ల లింక్‌పై రేవంత్ సర్కార్ ద్వంద్వ వైఖరి: కవిత

04 Nov, 11:21

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు ఐఫోన్ 16.. ఢిల్లీ కంపెనీపై ప్రశంసల వర్షం!

04 Nov, 11:20

గాయకుడిగా సల్మాన్.. 'తేరి సెక్సీ బ్యూటీ' సాంగ్ రిలీజ్

04 Nov, 11:19

ఏపీలో రేపే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు... పోలింగ్ జరుగుతుందా?

04 Nov, 11:13

ఇరాన్‌పై అణుదాడి జరిగితే భారత్‌కూ ముప్పు తప్పదా? రేడియేషన్‌ ఎక్కడి వరకు వస్తుంది?

04 Nov, 11:12

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఏపీ, తెలంగాణలో ఈడీ మెరుపుదాడులు

04 Nov, 11:09

రైలు వెళ్లిన కాసేపటికే పట్టాలపై పేలుడు.. అదీ భారత్‌-పాక్‌ సరిహద్దుకు కొంత దూరంలో..!

04 Nov, 11:08

ధన త్రయోదశి షాక్.. గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన బంగారం ధరలు!

04 Nov, 10:57

మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి పొన్నం

04 Nov, 10:54
..More Telugu News