అశ్వగంధ ఆకులపై కేంద్రం నిషేధం.. కారణం ఇదే!
- ఆహార ఉత్పత్తుల్లో అశ్వగంధ ఆకుల వాడకంపై కేంద్రం నిషేధం
- కేవలం వేర్లు, వాటి సారాన్ని మాత్రమే వాడాలని ఆదేశం
- ఆకుల వాడకంతో కాలేయానికి హాని కలుగుతుందని హెచ్చరిక
- లాభాల కోసం వేర్లకు బదులుగా ఆకులను కలుపుతున్న కంపెనీలు
- ఆకులతో ఉన్న ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశం
శతాబ్దాలుగా ఆయుర్వేదంలో 'మూలికల రాజు'గా పేరొందిన అశ్వగంధ వాడకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఈ మేరకు ఏప్రిల్ 16న అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. అశ్వగంధ ఆకులు కలిపిన ఉత్పత్తులను తయారుచేయడం, విక్రయించడం లేదా దిగుమతి చేసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న అటువంటి ఉత్పత్తులను వెంటనే వెనక్కి తీసుకోవాలని తయారీదారులను ఆదేశించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఎందుకు ఈ నిషేధం?
అశ్వగంధ ఆకుల్లో 'విథాపెరిన్-A' అనే రసాయనం అధిక మోతాదులో ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. ఇది పరిమితికి మించి శరీరంలోకి వెళ్తే కాలేయానికి హాని కలిగించవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. ఇటీవల ఐస్లాండ్, జర్మనీ, భారత్లో నిర్వహించిన పరిశోధనల్లో అశ్వగంధ సప్లిమెంట్లు వాడిన కొందరిలో కాలేయం దెబ్బతిన్న కేసులు నమోదయ్యాయి.
మరోవైపు, వేర్లతో పోలిస్తే ఆకులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. దీంతో కొన్ని కంపెనీలు లాభాల కోసం వేర్లకు బదులుగా చౌకగా దొరికే ఆకులను కలుపుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఆయుర్వేద గ్రంథాలు కూడా వేర్లను మాత్రమే అంతర్గత వినియోగానికి సూచిస్తున్నాయని, ఆకులను కేవలం బయటి పూతగా వాడాలని చెబుతున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ నేపథ్యంలో వినియోగదారులు అశ్వగంధ ఉత్పత్తులు కొనేటప్పుడు ప్యాకేజీపై 'అశ్వగంధ రూట్ ఎక్స్ట్రాక్ట్' లేదా 'అశ్వగంధ వేరు సారం' అని స్పష్టంగా రాసి ఉందో లేదో సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం 'అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్' అని ఉంటే అందులో ఆకులు ఉండే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.