మరో ఆసక్తికర పోరుకు సన్‌రైజర్స్ సిద్ధం... టాస్ గెలిచిన చెన్నై
- హైదరాబాద్ లో సన్ రైజర్స్ వర్సెస్ సీఎస్కే
- మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
- ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
- పిచ్ పరుగుల వరదకు అనుకూలమని నిపుణుల అంచనా
టాస్ గెలిచిన అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. "మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్‌లా కనిపిస్తోంది. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, అందుకే ఛేజింగ్‌కు మొగ్గు చూపుతున్నాం. గత మ్యాచ్‌లో మా బౌలర్లు రాణించడం సంతోషంగా ఉంది" అని తెలిపాడు.
సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. "మేము టాస్ గెలిస్తే కచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లం. ఇది మంచి వికెట్ కాబట్టి భారీ స్కోరు చేయాలనుకున్నాం. టోర్నమెంట్ సుదీర్ఘమైనది కాబట్టి ప్రతీ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోవాలి" అని పేర్కొన్నాడు.
పిచ్ రిపోర్ట్
పిచ్‌ను విశ్లేషించిన సైమన్ కటిచ్, డెల్ స్టెయిన్ దీనిని పరుగుల వరద పారించే పిచ్‌గా అభివర్ణించారు. ఇది ఎర్రమట్టితో కూడిన గట్టి వికెట్ అని, బంతికి మంచి బౌన్స్ లభిస్తుందని తెలిపారు. బౌండరీలు కూడా దగ్గరగా ఉండటంతో మరో భారీ స్కోరింగ్ మ్యాచ్ ఖాయమని అంచనా వేశారు.
రెండు జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఎషన్ మలింగ.
చెన్నై సూపర్ కింగ్స్:
సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గురుజప్నీత్ సింగ్.