టీసీఎస్ ఇష్యూ చిన్న విషయమట.. నిందితుడి బంధువు వ్యాఖ్యలు
- చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నారంటూ మీడియా ముందు ఫైర్
- బజరంగ్ దళ్ కుట్రేనని ఆరోపణ.. పెద్ద స్కాండల్ ఏమీ లేదని వాదన
- ఆధారాలున్నాయని, చట్టప్రకారం దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు
మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో ఉద్యోగులపై జరిగిన వేధింపుల అంశంలో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుండగా నిందితుడి బంధువు మాత్రం తేలిగ్గా తీసిపారేశారు. ఇదసలు అంత పెద్ద విషయమే కాదని, కుట్రపూరితంగా చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారని వాదనలకు దిగాడు. ఈ అంశంలో ‘బజరంగ్ దళ్’ పాత్ర కీలకమని ఆరోపించాడు. ఈ ఉదంతం మొత్తం బజరంగ్ దళ్ పన్నిన కుట్రేనని, ఇందులో నిజం లేదని నిందితుల్లో ఒకరి బంధువు సంచలన ఆరోపణలు చేశారు. ఇది పెద్ద స్కామ్ కాదని, కేవలం తమ వారిని ఇబ్బంది పెట్టేందుకే పక్కా ప్రణాళికతో సృష్టించారని అన్నారు.
ఈ కేసులో తన మేనల్లుడిని అన్యాయంగా ఇరికించారని ఆయన వాదించారు. కేవలం హిందూత్వ సంస్థల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే పోలీసులు ఈ చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మారుస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు మతపరమైన రంగు పులిమే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, నిందితుడి కుటుంబం చేస్తున్న ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు. టీసీఎస్ కార్యాలయంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు, నిందితుడి ప్రవర్తన సరిగా లేనట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీనిపై చట్టప్రకారమే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఒకవైపు నిందితుడి కుటుంబం ఇది కుట్ర అని వాదిస్తుండగా, మరోవైపు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని స్థానిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం నాసిక్‌లో రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.