సింగపూర్ వెళుతున్న మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం
- ఈ నెల 21 నుంచి సింగపూర్‌లో పర్యటించనున్న ఏపీ మంత్రులు
- పాలన, శాంతిభద్రతలు, పర్యాటకంపై అధ్యయనం చేయనున్న బృందం
- పర్యటనపై 9 మంది మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
- ఉత్తమ విధానాలను గుర్తించి ఏపీలో అమలు చేయాలని సూచన
ఈ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మంత్రుల బృందంతో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సింగపూర్‌లోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అక్కడి విజయవంతమైన విధానాల్లో వేటిని ఏపీలో అమలు చేయవచ్చో గుర్తించాలని సీఎం సూచించారు. తెలుసుకున్న ఉత్తమ విధానాలను రాష్ట్రానికి తిరిగి వచ్చాక అందరితో పంచుకుని, వాటి అమలుకు కృషి చేయాలని చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. ఈ పర్యటన ద్వారా సింగపూర్ తరహాలో అత్యుత్తమ పాలన, మౌలిక వసతులు, పర్యాటకాన్ని ఏపీలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.