తొలి ఏడాది జీతం 9 రూపాయలు పెంచారు... ఇప్పుడు అది కూడా లేదు... ఓ టెక్కీ ఆవేదన!
ప్రముఖ బహుళజాతి సంస్థలో (MNC) పనిచేస్తున్న ఒక టెక్ నిపుణుడి జీతం కేవలం 9 రూపాయలే పెంచడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండేళ్లుగా కష్టపడి పనిచేస్తున్న తనకు దక్కిన ప్రతిఫలం ఇదేనని, తాను ఓ గొయ్యిలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తోందని ఆ యువకుడు సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారి, కార్పొరేట్ కంపెనీల పనివిధానంపై కొత్త చర్చకు దారితీసింది.
వివరాల్లోకి వెళితే, దిల్లీ ఎన్‌సీఆర్‌లో పనిచేస్తున్న ఈ టెకీ 2024 మే నెలలో ఓ ప్రముఖ ఎంఎన్‌సీలో ఇంటర్న్‌గా చేరాడు. ఆరు నెలల తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప్రమోషన్ పొందాడు. ఉద్యోగంలో చేరినప్పుడు అతని వార్షిక ప్యాకేజీ రూ.4.25 లక్షలు. అయితే, గత రెండేళ్లుగా అదే జీతంతో పనిచేస్తున్నాడు. మొదటి సంవత్సరం పనితీరు సమీక్ష తర్వాత అతనికి కేవలం రూ.9 జీతం పెంచారు. ఆశ్చర్యకరంగా, 2025-26 సంవత్సరానికి ఆ పెంపు కూడా కొనసాగకపోవడంతో అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ఉద్యోగంలో చేరినప్పుడు మార్కెట్ పరిస్థితులు బాగోలేకపోవడంతో తక్కువ జీతానికే ఒప్పుకోవాల్సి వచ్చిందని అతను చెప్పాడు. కంపెనీతో అతనికి రెండేళ్ల బాండ్ ఉంది. ఒకవేళ ఉద్యోగం మానేయాలంటే రూ.1.5 లక్షల జరిమానా చెల్లించడంతో పాటు, ఆరు నెలల నోటీస్ పీరియడ్ కూడా పూర్తిచేయాలి. ఈ నిబంధనల వల్లే తాను ఇక్కడ చిక్కుకుపోయానని అతను వాపోయాడు. "నేను బానిసలా కష్టపడుతున్నాను. ఆఫీసుకు వెళ్లడం, క్లయింట్లను కలవడం, ప్రయాణాలు చేయడం వంటివన్నీ చేస్తున్నా. కానీ ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. పైగా, ఆఫీస్ షటిల్ కోసం నా జీతం నుంచే గణనీయమైన మొత్తాన్ని కట్ చేస్తున్నారు" అని తన ఆవేదనను వెళ్లగక్కాడు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. "మిమ్మల్ని తక్కువ జీతానికి వాడుకుంటున్నారు. మీరు వెళ్లిపోతే, మీ స్థానంలో మరో వ్యక్తిని ఇంతకంటే తక్కువ జీతానికి నియమించుకోవచ్చని కంపెనీకి తెలుసు" అని ఒకరు కామెంట్ చేయగా, "ముందు మీ నైపుణ్యాలు పెంచుకోండి. అప్పుడే మంచి జీతం, గౌరవం లభిస్తాయి" అని మరొకరు సలహా ఇచ్చారు.
ప్రస్తుతం ఐటీ రంగంలో ఆటోమేషన్, నియామకాల మందగమనం వంటి కారణాలతో జీతాల పెంపు నెమ్మదించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సంఘటన యువ టెక్కీలలో ఉద్యోగ సంతృప్తి, జీతాల పెంపు, కంపెనీల బాండ్ విధానాలపై తీవ్ర చర్చకు దారితీసింది.