హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం
- 2026-27 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు
- నేడు సాయంత్రం 4,381 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదు
- గ్రేటర్ చరిత్రలో 2026 మార్చి 3న 4,421 మెగావాట్ల విద్యుత్ వినియోగం
గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో 2026 మార్చి 3వ తేదీన 4,421 మెగావాట్ల విద్యుత్ వినియోగంతో ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డుగా ఉంది. రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతూ వినియోగదారులకు అవాంతరాలు ఎదురుకాకుండా విద్యుత్ సరఫరా సాగిస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరిగినా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.