నాలుగోసారి తల్లి కాబోతున్న ఉషా వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన అర్ధాంగి ఉషా వాన్స్ దంపతులు మూడో బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. వాషింగ్టన్‌లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో ఉషా వాన్స్ బేబీ బంప్‌తో కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమానికి హాజరైన ఉషా వాన్స్, గర్భవతిగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో ఆమె నాలుగోసారి తల్లి కాబోతున్నారనే వార్త స్పష్టమైంది. జేడీ వాన్స్, ఉషా దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు (ఇవాన్, వివేక్, మీరాబెల్) ఉన్నారు. ఇప్పుడు వీరి కుటుంబంలోకి నాలుగో చిన్నారి రాబోతుండటంతో అభిమానులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఉషా వాన్స్ అమెరికాలో న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె అమెరికా ‘సెకండ్ లేడీ’ హోదాలో పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి కుటుంబంలోకి వస్తున్న మొదటి సంతానం ఇదే కావడం విశేషం.

Usha Vance
JD Vance
Usha Vance pregnant
US Vice President
Second Lady
Indian American
Andhra Pradesh
Washington DC
Vance family

More Telugu News