టాలీవుడ్ లో కొత్త వివాదం... టీఎఫ్ సీసీ ప్రతిపాదనపై అగ్ర నిర్మాతల తీవ్ర అభ్యంతరం

Both States
Advertisement
  • టీఎఫ్ సీసీ ప్రతిపాదించిన పర్సంటేజ్ విధానంపై వివాదం
  • ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్
  • ఈ విధానం పాటించే థియేటర్లలో సినిమాలు ఇచ్చేది లేదని స్పష్టీకరణ
  • మైత్రీ, సితార, పీపుల్ మీడియా సహా 16 అగ్ర నిర్మాణ సంస్థల అభ్యంతరం
Advertisement
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం రాజుకుంది. థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఇటీవల ప్రతిపాదించిన "పర్సంటేజ్ ఆధారిత స్క్రీనింగ్ మోడల్"పై అగ్ర నిర్మాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని ఏకపక్షంగా తమపై రుద్దడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేస్తూ, యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG) ఏప్రిల్ 8న ఛాంబర్‌కు ఓ అధికారిక లేఖ రాసింది.
మార్చి 25, ఏప్రిల్ 2 తేదీలలో టీఎఫ్ సీసీ జారీ చేసిన సర్క్యులర్‌లను ప్రస్తావిస్తూ, ఈ కొత్త విధానం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్మాతలు తేల్చిచెప్పారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న పాత విధానాన్నే కొనసాగించాలని వారు కోరారు. ఎగ్జిబిటర్లతో నేరుగా చర్చలు జరిపి, తమ నిబంధనల ప్రకారమే సినిమాలను పంపిణీ చేసుకుంటామని గిల్డ్ స్పష్టం చేసింది. టీఎఫ్ సీసీ ప్రతిపాదించిన కొత్త విధానాన్ని పాటించే థియేటర్లకు తమ సినిమాలను ప్రదర్శన కోసం ఇచ్చేది లేదని నిర్మాతలు తమ లేఖలో అల్టిమేటం జారీ చేశారు.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖపై సంతకాలు చేసిన వారిలో టాలీవుడ్‌లోని పలు అగ్ర నిర్మాణ సంస్థల అధినేతలు ఉన్నారు. వారిలో రవిశంకర్ యలమంచిలి (మైత్రీ మూవీ మేకర్స్), సుధాకర్ చెరుకూరి (ఎస్ఎల్‌వి సినిమాస్), టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్), రవికిశోర్ (స్రవంతి), సుప్రియ (అన్నపూర్ణ స్టూడియోస్), బాపినీడు (ఎస్‌వీసీసీ), స్వప్న దత్ (స్వప్న సినిమా), సాహు గారపాటి (షైన్ స్క్రీన్స్), రాజీవ్ రెడ్డి (ఫస్ట్ ఫ్రేమ్), వెంకట సతీష్ కిలారు (వృద్ధి సినిమాస్), నాని (వాల్ పోస్టర్ సినిమా), చిట్టూరి శ్రీనివాసరావు (శ్రీనివాస సిల్వర్ స్క్రీన్), బన్నీ వాసు (బన్నీ వాస్ వర్క్స్), ఎస్‌కేఎన్ (మాస్ మూవీ మేకర్స్), ధీరజ్ మొగిలినేని (ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్) ఉన్నారు. 
Advertisement

సంబంధిత వార్తలు

TFCCTelangana Film Chamber of CommerceTollywoodTelugu Film IndustryATFPGActive Telugu Film Producers GuildMovie ScreeningPercentage Based Screening ModelFilm DistributionRavi Shankar Yelamanchili

More Telugu News

వెంకటేశ్ సినిమాకు గుడ్ న్యూస్.. టికెట్ ధరల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

27 Oct, 13:46

ఇక ట్రిపుల్ ఇంజన్ సర్కార్.. స్థానిక ఎన్నికలపై చాలా కసరత్తు చేశాం: సీఎం చంద్రబాబు

27 Oct, 13:43

భారత మిడిలార్డర్‌లో ఆరోగ్యకరమైన పోటీ: నితీశ్‌ రెడ్డి

27 Oct, 13:40

'రోబోను పెట్టుకో, మనిషిని తీసెయ్'.. ఏఐతో ఉద్యోగాల తొలగింపుపై బిల్ గేట్స్ వార్నింగ్‌!

27 Oct, 13:31

తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ కీలక నిర్ణయం.. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు

27 Oct, 13:29

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై పిటిషన్లు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

27 Oct, 13:24

మాది అభివృద్ధి, వారిది విధ్వంసం.. గొడ్డలి పార్టీ హింసను వీడి జనస్రవంతిలో కలవాలి: సీఎం చంద్రబాబు

27 Oct, 13:03

సీఎం చంద్రబాబు కృషి వల్లే సమన్వయం: మాధవ్ ప్రశంస

27 Oct, 12:58

గేమింగ్‌లో మొదలై ప్రపంచమంతా పాకిన పదం.. 2026 ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ఇదే..!

27 Oct, 12:57

కొత్త పెళ్లికూతురిగా విధులకు లోకో పైలట్.. వీడియో వైరల్!

27 Oct, 12:53

'బ్రేకింగ్ బ్యాడ్' తర్వాత ఇప్పుడు 'ప్రిజన్ బ్రేక్': విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ విమర్శలు

27 Oct, 12:48

భారత్‌ నుంచి రూ.5,876 కోట్ల వస్తువులు.. నిషేధం ఉన్నా పాకిస్థాన్‌కు ఎలా చేరాయి?

27 Oct, 12:46

స్థానిక ఎన్నికలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. రెబల్స్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ

27 Oct, 12:33

స్థానికాల్లోనూ అదే స్ఫూర్తి.. కూటమిని గెలిపించండి: ఎన్డీఏ నేతల విజ్ఞప్తి

27 Oct, 12:25

చెంబరంబాక్కం రిజర్వాయర్‌కు సీఎం విజయ్.. 2015 పునరావృతం కాకూడదని హెచ్చరిక!

27 Oct, 12:23
..More Telugu News